అన్వేషించండి
Advertisement
ODI World Cup 2023: వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ టాప్ స్కోరర్స్, వికెట్ టేకర్స్ వీరే - రోహిత్, కోహ్లీ మధ్య రేస్!
ODI World Cup 2023: ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరిగాయి. కొన్ని జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడగా, కొన్ని ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని జట్లు సెమీస్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని మ్యాచుల్లో పరుగుల వరద పారుతుండగా మరికొన్ని మ్యాచుల్లో తక్కువ లక్ష్యాలను కూడా జట్లు కాపాడుకుంటున్నాయి. ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరిగాయి. కొన్ని జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడగా, కొన్ని ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లో టాప్ టెన్‌లో ఉన్న జట్లు, ఆటగాళ్లు ఎవరంటే...
అగ్రస్థానంలో న్యూజిలాండ్
ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో పతకాల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన కివీస్ 8 పాయింట్లతో నంబర్ వన్‌లో ఉంది. టీమిండియా 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా రెండు విజయాలు, ఒక ఓటమితో మూడో స్థానంలో.. ఐదుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో 4వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌పై 62 పరుగులతో తేడాతో గెలవడంతో ఆసిస్ నాలుగో స్థానానికి ఎగబాకింది. రెండు విజయాలు, రెండు ఓటములతో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లు ఒక్కో విజయంతో వరుసగా 6, 7 స్థానాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్ మూడు మ్యాచ్‌లలో ఒక విజయంతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తొమ్మిదో స్థానంలో ఉంది. మూడు మ్యాచుల్లో గెలవని శ్రీలంక పదో స్థానంలో ఉంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది.
అత్యధిక పరుగులు
ఈ 18 మ్యాచ్‌ల తర్వాత ఈ టోర్నీలో పరుగుల పరంగా పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా సారధి రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే నాలుగో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు
మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) - 294 పరుగులు
రోహిత్ శర్మ (భారత్) - 265 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) - 259 పరుగులు
డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) - 249 పరుగులు
క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) - 229 పరుగులు
అత్యధిక వికెట్లు తీసినవారు
మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) - 11 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం) - 10 వికెట్లు
మాట్ హెన్రీ (న్యూజిలాండ్) - 9 వికెట్లు
షాహీన్ ఆఫ్రిది (పాకిస్థాన్) - 9 వికెట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 9 వికెట్లు
మరోవైపు భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలర్లు సమష్టి ప్రదర్శన... బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు ఎదురేలేకుండా పోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో.. రోహిత్ సేన ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే ఈ సెంచరీతో క్రికెట్ గాడ్ సచిన టెండూల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. మరొక్క సెంచరీ చేస్తే వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ 463 వన్డేల్లో 49 శతకాలు చేయగా.. కోహ్లీ 285 మ్యాచ్‌ల్లోనే 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. బంగ్లాదేశ్‌పై శతకంతో వన్డేల్లో సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్ మరింత చేరువగా వచ్చాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion