(Source: ECI | ABP NEWS)
మొదట్లో సింగిల్ దైవంగా పూజలందుకున్న గణపతి శైవంలో ఎప్పుడు కలిసి పోయాడు..సోమ స్కంద మూర్తి ఎవరు?
Ganesh Chaturthi 2025: మొదట్లో సింగిల్ దైవం గా పూజలు అందుకున్న గణపతి శైవం లో ఎప్పుడు కలిసి పోయాడు..సోమ స్కంద మూర్తి ఎవరు.. శివుని కుటుంబం లో గణపతి శిల్పాలు ఎందుకు ఉండేవి కాదు

Ganesh Chaturthi Special: భారతదేశంలో పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమైన దైవం విఘ్నేశ్వరుడు. అది దేవుడుగా మొదటి పూజ అందుకునే వినాయకుడు ఆరాధన ఇప్పుడున్న రూపంలో మొదట్లో ఉండేది కాదని చరిత్రకారులు చెబుతారు. గణపతిని భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో మోస్ట్ పవర్ ఫుల్ దేవుడి గా పూజించేవారు. ఆయన పూజలు విగ్రహాలు సింగిల్ దైవంగానే ఉండేవి అని మొదట కనుగొనబడిన గణపతి విగ్రహాలు ఆలయాలు చెబుతాయి అంటారు చరిత్ర కారులు.

మొట్టమొదటి గణపతి విగ్రహం 5వ శతాబ్దం నాటిది
ఇప్పటివరకు కనుగొనబడిన గణపతి విగ్రహాల్లో అన్నిటికంటే పురాతనమైనది మధ్యప్రదేశ్ తోని ఉదయగిరి గుహల్లో ఉంది. ఐదో శతాబ్దం (400CE ) నాటి ఈ విగ్రహం చాలా గంభీరంగా కేవ్ నంబర్ 6 లో ఇప్పటికీ ఉంది. అప్పట్లో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గణపతిని ప్రత్యేక దైవంగా పూజించేవారు. చూడగానే ముద్దొచ్చే రూపంతో ఉండే ఇప్పటి గణపతి కన్నా పురాతన కాలపు గణపతి మరింత పవర్ ఫుల్ అని చరిత్ర కారులు చెబుతారు. ఉత్తరాన గుప్తుల కాలం నాటికి ఒక రూపం సంతరించుకున్న గణపతి ఆరాధన ప్రస్తుత కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్ర ప్రాంతాలను 500 ఏళ్ల పాటు పరిపాలించిన చాళుక్యుల కాలం నాటికి వారి ప్రధాన ధైవంగా మారింది. వారి రాజధాని వాతాపి (బాదామి, కర్ణాటక ) లో గణపతి ఆరాధన చాలా ముఖ్యమైనది. వాతాపిలో ఉండే గణపతి విగ్రహం ఒకప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది.

సోమ స్కంధ మూర్తి ఎవరు? శివుని కుటుంబం లో లేని గణపతి
ఒకపక్క చాళుక్య సామ్రాజ్యం గణపతి పూజను ప్రధానంగా చేస్తే మరో పక్క తమిళనాడు ప్రాంతాలను పరిపాలించిన వారి శత్రువులు పల్లవ సామ్రాజ్యంలో ప్రధానంగా 'సోమస్కంధ మూర్తి' ని పూజించేవారు.( శివ+ఉమ +స్కంధ ) శివపార్వతులను కుమార స్వామితో కలిప చిత్రించిన సోమస్కంద మూర్తి శిల్పాలు పల్లవుల ఆధ్యాత్మిక రాజధాని మామల్ల పురం (మహాబలి పురం, తమిళనాడు ) లో కోకొల్లలు గా కనపడతాయి. ఆ శిల్పాలలో శివుడు, ఉమాదేవి, బాల కుమారస్వామి తో పాటు వారి వెనకాల ఎడమవైపు ఇంద్రుడు కుడివైపు విష్ణుమూర్తి ఉంటారు తప్ప గణపతి కనపడడు. అప్పటికి పల్లవరాజ్యంలోనూ గణపతి పూజ ఉండేది కానీ శివారాధనలో అది కలిపి ఉండేది కాదని గణపతిని ప్రత్యేక దైవంగా పూజించేవారని ఆల్బర్ట్ మూర్ 1977లో రాసిన ఐకనోగ్రఫీ ఆఫ్ రెలిజియన్స్ : ఏన్ ఇంట్రడక్షన్ లో పేర్కొన్నారు. తర్వాత కాలంలో పల్లవులు నరసింహ వర్మన్ 1 కాలం లో (630-668)దండెత్తి బాదామి చాళుక్యులను ఓడించడంతో పాటు ప్రసిద్ధ వాతాపి గణపతి విగ్రహాన్ని బాదామి నుండి తమ పల్లవ రాజ్యానికి తీసుకుపోయారని కథనం ఉంది. అక్కడ నుంచి నెమ్మదిగా దక్షిణ భారతదేశంలో శివుని కుటుంబంలోకి గణపతి కూడా ప్రవేశించడం మొదలైందని పల్లవుల తర్వాత రాజ్యానికి వచ్చిన చోళ రాజులు టైం కి శివుడు, పార్వతి, మురుగన్ లతో పాటు గణపతి కూడా శివుని ఆరాధన లో భాగం అయ్యాడని చరిత్ర కారులు అంటారు.

ఉత్తర భారత దేశం లో గుప్తుల కాలం నుండే శివుని తో పాటే గణపతి
ఉత్తర భారత దేశంలో మాత్రం శివునితో పోటే గణపతి ఆరాధన ఉండేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని 5 వ శతాబ్దం నాటి భూమ్రా శివాలయ శిథిలాల్లో తన తొడ పైన శక్తి మాత ను కూర్చోబెట్టుకున్న గణపతి విగ్రహాన్ని కనుగొన్నారు. అయితే ఆ ప్రాంతాల్లో కుమారస్వామి విగ్రహాలు లేవు. వీటన్నిటిని బట్టి గుప్తుల కాలం నాటికి ఉత్తర భారత దేశం లో శివుని తోపాటు గణపతి పూజ కూడా చేరగా దక్షిణ భారతదేశంలో మాత్రం మొదట గణపతి పూజ, శివుని పూజ వేరువేరుగా చేరుతూ 7వ శతాబ్దం నాటికి రెండు ఒకటేగా కలిసిపోయాయని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ప్రధానమైన దైవ ఆరాధనల్లో గణపతి నవరాత్రులు ముఖ్యమైనదిగా మారిపోయింది.

వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















