భయపెట్టే వినాయక రూపం 'అఘోర గణపతి' - ఇంట్లో ఈయన పూజలు నిషిద్ధం
Ganesh Chaturthi 2025: భయపెట్టే వినాయక రూపం అఘోర గణపతి - ఇంట్లో ఈయన పూజలు నిషిద్ధం...

Aghora Ganapati: ఆది దేవుడు వినాయక పూజను.. గణపతి రూపాన్ని ఇష్టపడని భారతీయులు ఎవరూ ఉండరు. ముద్దుగా బొద్దు గా ఉండే వినాయక రూపం హుందాగా ఉండే మహా గణపతి రూపాలు అందరికీ తెలిసినవే. వినాయక చవితి వస్తే గణపతిని పూజించని గ్రామమే కనపడదు. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే వినాయకుడి కొన్ని అవతారాలు చాలా రౌద్రంగా ఉంటాయి. అలాంటి రూపాల పూజలు కూడా ఊళ్ళలో ఇళ్లలో చేయకూడదు అంటారు. అవి తెచ్చే శక్తిని సామాన్యులు భరించలేరు అనేది పెద్దలు చెప్పే మాట. అలాంటి భయంకరరూపాలలో ఇంకా భయంకర రూపం ఇంకొకటి ఉంది. అదే "అఘోర గణపతి "
రూపం
నేపాల్ తాంత్రికులు పూజించే "అఘోర గణపతి "
మనం ఇళ్లల్లో పూజించే నాలుగు చేతులు, చేతిలో మోదకాలు, ముఖంలో దరహాసం తో ఉండే చక్కటి బొజ్జ గణపయ్య రూపం కాదిది. చింత నిప్పుల్లా ఉండే ఎర్రటి కళ్ళు, మెడలో కపాలాల దండ, పది చేతులు, నుదిటిపై మూడో నేత్రంతో చేతిలో త్రిశూలం, కపాల పాత్ర, నిప్పు ధరించి అత్యంత భయంకరం గా ఉండే ఈ వినాయక రూపాన్ని వామాచార ప్రక్రియల్లో ఎక్కువగా పూజిస్తారని ప్రతీతి. ఒకప్పుడు అఘోరాలు, నేపాల్ లోని కొందరు తాంత్రికులు స్మశానాల్లో "అఘోర గణపతి " ని పూజించే వారు. మామూలు గణపతి రూపం జ్ఞానాన్ని, మేధస్సు నీ, శుభాల్ని కలుగ జేస్తే "అఘోర గణపతి "మాత్రం విపరీతమైన శక్తి నీ, భవ బంధాల నుంచి విముక్తి నీ ప్రసాదిస్తాడని నమ్మకం
ఈ రూపం సామాన్యులకు నిషిద్ధం
"అఘోర గణపతి" పూజ చాలా విపరీతమైన పద్ధతుల్లో ఉంటుందని ఈ గణపతిని ఇళ్లల్లో పూజించ కూడదని అంటారు. ఈ గణపతి రూపం తెచ్చే ఉదృతమైన శక్తి ని సామాన్యులు భరించలేరని అందుకే "అఘోర గణపతి" పూజను జనావాసాల మధ్య జరుపకూడదని పెద్దలు నిషేఖధించారు.అందుకే " అఘోర గణపతి "కి ఎక్కడా గుళ్ళు ఉండవు. మామూలు గుళ్ల లో కనీసం ఆ పేరు కూడా పలుకనివ్వరు.
"అఘోర గణపతి" లాంటి మరికొన్ని భయంకర రూపాలు
వెయ్యేళ్ళ క్రితం నాటి " ముదగల పురాణం " ప్రకారం వినాయకుడిని 32 రూపాల్లో పూజిస్తారు. వీటిలో 16 రూపాలు చాలా అందంగా భక్తుల పాలిట కొంగు బంగారం లా పూజలు అందుకుంటాయి. వీటిని "షోడశ గణపతి" రూపాలు అంటారు. వీటిలో "మహా గణపతి" రూపం బాగా పాపులర్.మిగిలిన 16 రూపాలు అంతగా పాపులర్ కావు. వాటిలో కొన్ని రూపాలను తాంత్రిక విధానాల్లో పూజిస్తారు. వాటిలో "ఉచ్చిష్ట గణపతి ""శక్తి గణపతి" "హెరంబ గణపతి" లాంటి పూజా విధానాలు చాలా ప్రమాదకరం. "హెరంబ గణపతి" ని ఎక్కువగా నేపాల్ లోని తాంత్రికులు పూజిస్తారు.అయితే "అఘోర గణపతి" వీటికన్నా కూడా ఉగ్రం గా ఉండే రూపం అని చెబుతారు. అయితే ఇప్పటి కాలం లో " అఘోర గణపతి " పూజలు ఎక్కడా లేవనే చెప్పాలి
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















