Spirituality-Vastu Tips: వాస్తు దోషాలు తొలగి అదృష్టం కలసిరావాలంటే ఈ బొమ్మ ఇంట్లో ఉంటే చాలట

తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసొస్తుందా.. వాస్తు సమస్యలు తొలగిపోతాయా...అంతా మంచే జరుగుతుందా.. ఇందులో నిజమెంత..వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది...

FOLLOW US: 

వాస్తు విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్. పట్టింపు లేనివారికి ఏ సమస్యా ఉండదు కానీ వాస్తు పట్టింపు ఉండేవారికి మాత్రం అడుగేసినా, తీసినా ఆలోచిస్తారు. ఇంట్లో అడుగడుగునా ఎక్కడ ఏం ఉండాలి, ఏం ఉండకూడదనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఇంట్లో తాబేలు పెట్టుకోవడం కూడా ఒకటి. తాబేలు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగి పోతాయని విశ్వసిస్తారు. 

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి

వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చైనా వాస్తు అని పిలిచే ఫెంగ్‌షుయ్ పద్ధతిలో తాబేలు ఎలా తన ఐదు అవయవాలను (తల, నాలుగుకాళ్లను) ఎలా లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంటే ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా రక్షిస్తుందని చెబుతారు. ముఖ్యంగా సంపద, ఆయుష్షు, శుభాలకు సంకేతంగా చెబుతారు. 

 • లోహంతో తయారు చేసిన తాబేలును నీటితో నింపిన పాత్రలో ఉంచి ఇంట్లో ఉత్తర దిశలో కానీ ఉత్తరం వైపున్న బెడ్ రూమ్ లో కానీ ఉంచాలి.ఇలా చేయడం వల్ల మీకు శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.దిష్టి కూడా తొలగిపోతుంది.
 • స్పటికంతో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచితే సంతోషం వెల్లివిరుస్తుంది
 • తాబేలుని తూర్పు దిశలో ఉంచితే అశాంతి, సమస్యలు తలొగిపోతాయి
 • బొమ్మ తాబేలు మాత్రమే కాదు బతికున్న తాబేలుని తీసుకొచ్చి అక్వేరియంలో పెట్టొచ్చు
 • హిందూ పురాణాల ప్రకారం.. తాబేలును శ్రీ మహావిష్ణువు కుర్మావతారంగా భావిస్తారు. ఈ అవతారంలో వచ్చిన మహావిష్ణువు ఎన్నో అద్భుతాలు చేశారని చాలా మంది నమ్ముతారు.వాస్తురీత్యా ఉత్తర దిక్కు బుధుడికి చెందినది. ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు.
 • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడికి అదిదేవుడు విష్ణువు. తాబేలుని నీటిలో ఉంచి ఉత్తర దిక్కువైపు ఉంచడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి
 • తాబేలు ఉన్న ఇంట్లో ఉంటే పిల్లల్లో జ్ఞానసంపద పెరుగుతుందని విశ్వసిస్తారు
 • ముఖ్యంగా ఇంట్లో వాస్తుదోషాలేమైనా ఉంటే వాటికి తాబేలు ఉపశమనం లభిస్తుంది
 • ఆర్థిక సమస్యలు పరిష్కారం అవడమే కాదు..డబ్బుకి లోటుందు
 • షాపులో తాబేలు ఉంచితే వ్యాపారం వృద్ధి చెందుతుంది..

నోట్: వాస్తుశాస్త్ర నిపుణులు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు

Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 

Published at : 03 May 2022 04:01 PM (IST) Tags: Vastu tips vastu for home vastu dosh vastu shastra for home Vaastu vastu tips for home can we keep tortoise at home

సంబంధిత కథనాలు

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం

Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం

Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 27th May 2022: ఈ రాశులవారికి అనారోగ్య సూచనలున్నాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

RR Vs RCB: ఆఖర్లో తడబడ్డ బెంగళూరు - రాజస్తాన్ ముందు ఈజీ టార్గెట్!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్ 

Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్