News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Spirituality/Vastu: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి

చాలామంది ఇల్లు కట్టున్న తర్వాత, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాస్తు దోషాలున్నాయేమో అని వాస్తు నిపుణుల్ని సంప్రదిస్తారు. ఇంతకీ వాస్తు దోషం ఎందుకు ఏర్పడుతుంది, వాస్తు దోషం ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి...

FOLLOW US: 
Share:

 వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు
1. భూమి కొనే ముందే అన్ని కోణాల్లో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే అక్కడ కట్టిన ఇల్లు బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశంలో ఇల్లు కట్టినా ఆ ఇంట్లో మనశ్సాంతి ఉండదు. 
2. యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలో ముందే నిర్ణయించుకోవాలి. 
3. అన్నీ చూసుకుని ఇల్లుకట్టుకున్న తర్వాత కూడా ఏదో తేడాఉంది అనిపిస్తే.. ఆ ఇంట్లో ఉన్నవారు పాటించే పద్ధతులు, ప్రవర్తన విధానంలో ఏదో తేడా ఉందని అర్థంచేసుకోవాలి. ( అకారణంగా స్త్రీలను ఇబ్బందులకు గురిచేయడం, నిత్యం ఆడవారి ఏడుపు, వృద్ధులు బాధపడే ఇల్లు, జీవహింస చేయడం, పాముల్ని చంపడం లాంటివి జరిగే ప్రదేశంలోనూ వాస్తు దోషాలు వెంటాడతాయి)

Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
వాస్తు దోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి

  • కొన్ని ఇల్లు చూస్తే వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దోషం కనబడదు. కానీ ఆ ఇంట్లో నివాసం ఉన్నప్పటి నుంచీ అకారణంగా వివాదాలు, చికాకులు, ఆనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఆ వ్యక్తి జాతకంలో దోషాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు. కానీ జాతకంలో ఎలాంటి దోషం లేకపోయినా ఇలా జరుగుతోందంటే ఈ ఇంట్లో వాస్తుదోషం ఉన్నట్టే.
  • మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది. కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకుగా అనిపిస్తుంది.
  • పెంపుడు కుక్క పదే పదే ఒకే దిశకి తిరిగి అరవటం కూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా కనపడిని వాస్తు లోపాలున్నాయని సూచనలు. కొన్ని నివాసాలైతే ఎంత అందంగా సర్దినా ఏదైనా చికాకుగా కనపడతాయి.
  • కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణంగా భయం వేస్తుంది. అంటే ఆ ఇళ్లలో గతంలో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండొచ్చు. అంటే పిశాచాలు అక్కడే తిరుగుతున్నాయని కాదు కానీ కొన్ని చికాకులు మాత్రం ఉండిపోతాయి.

Also Read:  వాస్తు ప్రకారం పడకగది ఏ వైపు ఉండాలి, ఎలా ఉండాలి

వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్లని కొన్ని చికాకుల కారణంగా వదిలివెళ్లలేం. అలాంటప్పుడు దోషం ఏంటో తెలుసుకుని తగిన పరిష్కారం చేయిస్తే సరిపోతుంది. అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకుల నుంచి తప్పించుకోలేం. కొన్నిసార్లు ఎన్ని చికాకులున్నా మీరు స్ట్రాంగ్ గా ఉంటే ఏ దోషమూ మిమ్మల్ని ఏం చేయలేదు. 

వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Published at : 17 Feb 2022 12:57 PM (IST) Tags: Vastu tips vastu tips for home vastu shastra vastu dosha vastu dosha nivarana vastu dosham vastu shastra for home vastu dosha nivarana in telugu vastu dosha remedies vastu dosha parihara

ఇవి కూడా చూడండి

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Horoscope Today Dec 11, 2023: కార్తీకమాసం ఆఖరి సోమవారం మీ రాశిఫలం, డిసెంబరు 11 రాశిఫలాలు

Spirituality: సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Spirituality:  సుమంగళి మహిళలు విభూతి పెట్టుకోవచ్చా - మగవారు విభూతి ఎలా ధరించాలి !

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Weekly Horoscope Dec 10 to Dec 16: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!