అన్వేషించండి
Advertisement
Spirituality/Vastu: వాస్తు ప్రకారం పడకగది ఏ వైపు ఉండాలి, ఎలా ఉండాలి
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. అందుకే అణువణువు వాస్తు ప్రకారం ఉండాలని కోరుకుంటారు. మరి ప్రశాంతతని ప్రసాదించే పడకగది వాస్తుప్రకారం ఎలా ఉండాలంటే
వాస్తు ప్రకారం పడక గదిని (Bed Room) నిర్మించుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపడమే కాదు మానసిక ప్రశాంతంతని ఇస్తుందంటారు వాస్తునిపుణులు.
పడక గది (Bed Room) ఏ దిక్కున ఉంటే ఏమవుతుంది
- పడక గదిని సాధ్యమైనంత వరకు ఈశాన్యం, ఆగ్నేయం దిక్కుల్లో నిర్మించుకోకూడదు. ఒకవేళ ఆ దిశల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు, చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవడం, మంచి సంబంధాలు కుదరకపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతాయి
- బెడ్ రూమ్ ఎప్పుడూ నైరుతి దిక్కునే ఉండాలి. ఇటువైపున్న బెడ్ రూమ్ లో ఇంట్లో అందరికన్నా పెద్దవారుండాలి.
- ఆగ్నేయ దిశలో పడక గది నిర్మించుకుంటే అనవసరమైన సమస్యలు వెంటాడుతాయి. నిద్రపట్టక పోవడం, ఇంట్లో ఆందోళనలు, భార్యభర్తల మధ్య మనస్పర్థలు లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇవే కాకుండా ఈ దిశలో పడక గది ఉంటే కుటుంబ సభ్యుల ప్రవర్తనలోనూ తేడా వస్తుంది.
- చిన్నారులకైతే ఆగ్నేయ దిక్కులో ఉన్న పడక గది మంచి చేకూరుస్తుంది. సిగ్గు, బిడియం లాంటివి తొలిగి వారి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.
Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..
బెడ్ రూమ్ ఎలా ఉండాలి
- పడకగది (BED Room)లో మంచాన్ని ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే ఆరోగ్య, మానసిక విషయాలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది
- పడకగది తలుపుకి, కిటికీకి ఎదురుగా మంచం ఉండకూడదు. వాస్తు పరంగా కాకపోయినా ఇలా ఉంటే వెలుగు ఎక్కువ రావడం వల్ల నిద్రకు భంగం (Disturbance) కలుగుతుంది
- అద్దాన్ని కాని, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కాని, కాళ్లవైపు కాని ఉంచకూడదు. నిద్రపోయే సమయంలో ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం. శరీరం నుంచి ఆత్మ బయటకు రాగానే అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని కంగారు పడుతుందట. దానివలన లేనిపోని అనర్ధాలు కలుగుతాయని నమ్ముతారు. నిద్రపోతున్నప్పుడు ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తుందని మనదేశంలోనూ చాలామంది విశ్వసిస్తారు.
- బుక్‌షెల్ఫ్, డ్రెస్సింగ్ టేబుల్ అంచుల నుంచి వీచే సూటి గాలులు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
- బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు, ఉపయోగపడని గృహోపకరణాలు ఉండకూడదు.
- టెలివిజన్, రేడియో, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ సాధనాలు పడకగదిలో ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది
- ఎట్టి పరిస్థితులోనూ మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్ కిందకాని, స్థంబాల కిందకాని ఉండకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని ఇలా వేసుకోవల్సి వస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీయాలంటారు వాస్తు నిపుణులు
Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion