Vastu Shastra-Spirituality: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది

ఇంటి నిర్మాణంలో స్థలం ఎంపిక చాలా ముఖ్యం అంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తవానికి వాస్తు ఇంటి స్థలం ఎంపిక నుంచే మొదలవుతుంది. ఇంతకీ ఎలాంటి స్థలం కొనాలి..ఎలాంటి స్థలం కొనుక్కోకూడదు..

FOLLOW US: 

వాస్తు ప్రకారం ఎలాంటి స్థలం కొనకూడదు

 • నదుల దగ్గర,  కొండల దగ్గర, స్మశానాల దగ్గర,  దేవాలయం దగ్గరగా ఉన్న ఇళ్ల స్థలాలు కొనకూడదు. అలాంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు
 • ఈశాన్యము తగ్గిన స్థలం కొనకూడదు. ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటే అందులో నివశించే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశం వృద్ధి క్షీణిస్తుంది.  సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.
 • మీరు కొనుగోలు చేయాలనుకున్న స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కుల్లో వేరే వారి ప్లేసులు ఉంటే.. అక్కడి నుంచి నీరు మీరు కొనుగోలు చేసే  స్థలంలోకి పారకుండా చూసుకోవాలి. ఇలా ఉండకపోతే అది నివాసానికి అనువైనది కాదు.
 • రెండు విశాలమైన ప్లేసెస్ మధ్య ఉన్న ఇరుకైన జాగాని కొనుగోలు చేయొద్దు. దీనివల్ల మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది. 

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి

ఎలాంటి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయాలి

 • ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ జాగా కొనడం శుభఫలితం. యజమానికి పేరు ప్రతిష్టలు వస్తాయి, సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు.
 • ఉత్తర- ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా  ఆర్థికి స్థితి అమాంతం పెరుగుతుంది. ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు.
 • తూర్పు- ఈశాన్యం పెరిగిన స్థలం కొనుగోలు చేస్తే సిరి సంపదలతో పాటూ  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  కుటుంబంలో సుఖ సంతోషాలు  వెల్లివిరుస్తాయి.
 • ఇల్లు కట్టుకోవడానికి దీర్ఘ చతురస్రాకారంగా ఉండే స్థలం మంచిది. దాని పొడవు 2 :1 నిష్పత్తులకు మించి ఉండకూడదు.
 • చతురస్రాకారంగా ఉండే స్థలం వాస్తు సూత్రాలకు అనుగుణంగా కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
 • ప్లాటుకు ఉత్తరాన గాని తుర్పున గాని రోడ్డు కలిగిన ప్లాటు మంచిది
 • ప్లాటుకు తూర్పున పడమర రోడ్డు ఉన్నా మంచిదే.
 • ఇంటి స్థలానికి ఉత్తరాన కానీ ఈశాన్యంలో కానీ  తూర్పువైపున చెరువు, బావి, కుంటలు, నదులు ఉంటే మంచిది.
 • ఇంటి స్థలానికి పడమర వైపు కొండలు దక్షిణం వైపు ఎత్తుగా ఉన్న ప్లాటు ఉండొచ్చు

ఇవన్నీ మినిమం చూసుకోవాల్సిన విషయాలు... అయితే ఎన్ని తెలుసుకున్నప్పటికీ ఇంటి స్థలాన్ని నేరుగా వాస్తు పండితులకు చూపించిన తర్వాతే ఇంటి నిర్మాణం ప్రారంభించడం మంచిది. 

Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి

Published at : 03 Mar 2022 02:24 PM (IST) Tags: Vastu tips vastu tips for home vastu remedies vastu for home vastu shastra vastu shastra for home vastu for plots vastu for land

సంబంధిత కథనాలు

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఆగస్టులో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

టాప్ స్టోరీస్

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్

Ritika Singh Latest Photos: గురు - ఈ హీరోయిన్ గుర్తుందా? రితికా సింగ్