అన్వేషించండి

Spirituality: దేవుడి దగ్గర దీపం అకస్మాత్తుగా కొండెక్కిపోతే ఏం జరుగుతుంది!

Puja Tips: దేవుడిని పూజించేటప్పుడు దీపం వెలిగించ‌డం మ‌న‌ సంప్రదాయం. అయితే దేవుడిని పూజించేటప్పుడు దీపం ఆరిపోతే దాని అర్థం ఏమిటి.? దేవుడి దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ఏం చేయాలి.?

Puja Tips: హిందూ సంస్కృతిలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ చేసి హారతి ఇచ్చే సంప్ర‌దాయం త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతోంది. పూజ సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు, తులసి మొక్క ముందు ప్రతిరోజూ దీపం వెలిగిస్తారు. అదే సమయంలో పూజ చేస్తుండగా దీపం అకస్మాత్తుగా ఆరిపోయినట్లయితే, అది అప‌ శకునంగా, అశుభంగా పరిగణిస్తుంటారు. పూజ చేసేట‌ప్పుడు దీపం ఆరిపోతే అది దేనిని సూచిస్తుంది? అసలు ఆరిపోవడం అనే పదం వినియోగించడమే అపచారం అని కొండెక్కిందని, ఘనమైందని అనాలంటారు. ఇంతకీ దీపం ఆగిపోతే ఏమవుతుంది...ఏం చేయాలి?

1. దేవునికి దీపం వెలిగించడంలో విశిష్టత ఏమిటి.?

దేవతారాధన, హవనం, పారాయణ లేదా ఏదైనా శుభ కార్యక్రమంలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీపం వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. శాస్త్రాల ప్రకారం, దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. అలాగే దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

Also Read : భగవద్గీతను పూజించాలా - అనుసరించాలా!

2. దీపం అకస్మాత్తుగా ఆరిపోతే దాని అర్థం ఏమిటి?

పూజ సమయంలో దీపం ఆరిపోవ‌డం సాధారణంగా అప‌ శకునంగా పరిగణిస్తారు. పూజ సమయంలో దీపం ఆరిపోతే, అది దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని సూచిస్తుంది. పూజ పూర్తికాలేదని, పూజ చేసినా పూర్తి ఫలం మీకు లభించదని అర్థం. అంతేకాదు, దేవుని ముందు మీరు కోరిన‌ కోరిక నెరవేరదని అర్థం. మనిషి పవిత్రమైన మనస్సుతో భగవంతుడిని పూజించకపోయినా, దేవుని దీపం కొండెక్కిపోతుందంటారు. కానీ...అస్సలు ఇలాంటివి పట్టించుకోరాదు..దేవుడిపై భక్తి ప్రధానం అంటారు మరికొందరు పండితులు

3. దీపం అకస్మాత్తుగా ఆరిపోతే?

పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి, వత్తిలో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో, పూజ సమయంలో మీరు వెలిగించిన‌ దీపం ఆరిపోతే, భ‌గ‌వంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపం వెలిగించండి. దీపంలో తగినంత నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి. 

4. అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి

ఒక వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అఖండ జ్యోతిని వెలిగిస్తే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే కోరిక తీరదు. అలా జరగకుండా ఉండాలంటే   జ్యోతి నిరంత‌రంగా వెలిగేలా, దాని చుట్టూ ఒక గాజు పాత్ర‌ ఉంచండి, దానిలో పుష్కలంగా నూనె లేదా నెయ్యి పోయండి. అలాగే అఖండ జ్యోతి పక్కన చిన్న దీపం వెలిగించండి. అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కిపోతే ఈ చిన్న దీపంతో మళ్లీ అఖండ జ్యోతిని వెలిగించవచ్చు.

Also Read : పూజ గదిలో బల్లి కనిపించడం దేనికి సంకేతమో తెలుసా!

మనం చేసే పూజలు భగవంతుడికి ఆమోదయోగ్యం కానప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మనం ప్రార్థించిన కోరికలు తీరనప్పుడు, దేవుని వ‌ద్ద వెలిగించిన‌ దీపం ఆరిపోతుందని చాలామంది విశ్వాసం. అయితే దీపం కొండెక్కడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు...ఆ సమయంలో భగవంతుడికి నమస్కరించి తిరిగి వెలిగించండి కానీ ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు పండితులు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget