అన్వేషించండి

Lizard Signs: పూజ గదిలో బల్లి కనిపించడం దేనికి సంకేతమో తెలుసా!

Lizard Signs: బల్లులు మన భవిష్యత్తుకు సంబంధించిన శుభ, అశుభ సంకేతాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.

Lizard Signs: మనిషి జీవితంలో జరిగే ప్రతి మార్పు గురించి శాస్త్రం చెబుతుంది. కొన్నిసార్లు జంతువులు, పక్షులు కూడా మనకు శుభం,  అశుభ సంకేతాల‌ను సూచిస్తాయి. కొన్ని జంతువులు లేదా పక్షులు మనకు అభివృద్ధిని, శుభసూచకాలను ఇస్తాయి, మరికొన్ని జంతువులు లేదా పక్షులు వాటి చర్యలతో హెచ్చరిస్తాయి.   బల్లులను చూడటం, బల్లి మీద‌ పడటం కూడా ఓ సంకేతమే. అయితే అది శుభమా-అశుభమా అన్నది ఆ సమయం, సందర్భం ఆధారంగా తెలుస్తుందని చెబుతారు పండితులు. కొన్ని సందర్భాల్లో బల్లి కనిపించడం మంచికి సంకేతం అయితే మరికొన్ని సందర్భాల్లో ముందస్తు హెచ్చరికగా భావించాలి.         

1. మూడు బల్లులను చూడటం        
మనం తెల్లవారుజామున మూడు బల్లులు కలిసి ఉండ‌టం చూస్తే, అది మన జీవితంలో మనం పొందగల అదృష్టం, ఐశ్వ‌ర్యాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచైనా శుభవార్తలను అందుకుంటార‌ని సంకేతం. రాబోయే రోజుల్లో మీ కలలన్నీ నిజమవుతాయి. పనిలో పురోగతికి దారులు తెరుచుకుంటాయి. ఇది మీ జీవితంలో శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ సంఘటన మీ జీవితానికి శుభసూచకంగా గుర్తించాలి.

Also Read : శ‌రీరంపై బల్లి పడితే ఏమ‌వుతుంది..?

2. బల్లుల పోరాటం         
మూడు బల్లులను చూడడం ఎంత శుభమో, రెండు బల్లులు పోట్లాడుకోవడం అంత‌ అశుభం. ఇది మీ జీవితంలో పెను ప్రమాదాన్ని సూచిస్తోందని అర్థం చేసుకోవాలి. మీరు రెండు బల్లులు పోట్లాడుకోవడం చూస్తే, మీరు త్వరలో ఏదైనా పెద్ద వివాదంలో చిక్కుకుంటారని అర్థం. రెండు బల్లులు పోట్లాడుకోవడం చూసినప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటను గమనించండి. మాట్లాడేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటూ ప‌రుష ప‌దాలు లేకుండా చూసుకోండి.                             

3. పూజ‌ గదిలో బల్లి        
మీకు ప్రార్థనా స్థలంలో లేదా మీ ఇంట్లోని పూజ‌ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి. అలాగే, మీరు గుడికి వెళ్లి అక్కడ బల్లిని చూసినట్లయితే, అది కూడా మీకు శుభ సూచకంగా భావించాలి. అంటే మీకు జీవితంలో ధ‌న‌ధాన్యాల‌కు కొరత ఉండదు. తద్వారా మీ ఆర్థిక స్థితి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. అంతే కాదు ఎక్కడి నుంచైనా అప్ర‌య‌త్నంగా డబ్బులు వస్తాయి. కానీ, దుష్టులకు సేవ చేసే వ్యక్తికి పూజ గ‌దిలో లేదా ఆలయంలో బల్లి క‌నిపిస్తే, అది  కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక‌ సమస్యలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని సూచన.

Also Read : ఇంట్లో బల్లులు ఉండటం మంచిదేనా? తోక ఊడిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget