చాణక్య నీతి: ప్రేమ బంధం అంటే ఇదే!



బన్దనాని ఖలు సన్తి బహూని ప్రేమరజ్జుకృతబన్ధనమస్యత్
దారూభేదనివుణో షడంఘ్రి - నిష్క్రియో భవతి పంకజకోశే



ప్రేమబంధం గురించి స్పష్టంగా వివరించేందుకు చాణక్యుడు ఈ శ్లోకం చెప్పాడు



ప్రపంచంలో బంధాలెన్ని ఉన్నా ప్రేమబంధం ప్రత్యేకమైనది. దీనిముందు తలొంచని వారెవరూ ఉండరు



అందుకు ఉదారహణ భ్రమరం (తుమ్మెద)



కర్రని కొరికేసి రంధ్రాలు పెట్టగల సామర్థ్యం భ్రమరం సొంతం.. కానీ



సూర్యాస్తమయం తర్వాత కలువపువ్వు రేకుల మధ్య బంధీ అయిపోతుంది



భ్రమరానికి తామరపువ్వు అంటే ఎంతో ప్రేమ..అలాంటప్పుడు కర్రని కొరికేసినట్టు పువ్వుని కొరికేయలేదుకదా



రాత్రంతా కదలకుండా తామరపువ్వు రేకుల మధ్య ప్రేమ అనే చెరశాలలో గడిపేస్తుంది



ప్రేమబంధం ఎంత గొప్పదో చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముందంటాడు చాణక్యుడు
Images Credit: Pinterest