ABP Desam


ఈ కల వస్తే ఎవ్వరికీ చెప్పొద్దు!


ABP Desam


నాకు ఏం కలవచ్చిందో తెలుసా అంటూ వివరంగా చెబుతుంటారు కొందరు. అయితే కొన్ని కలలు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదట


ABP Desam


మనం చనిపోయినట్టు మనకే కలరావడం, చనిపోయిన తర్వాత కూడా మనచుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది. ఇది శుభసూచకమే అన్న స్వప్న శాస్త్ర నిపుణులు మీ జీవితంలో సంతోషం నిండబోతోందనే సూచన ఇది



తల్లిదండ్రులకు ఇలలో సేవ చేస్తారో చేయరో కానీ చాలామంది కలలో మాత్రం చేస్తుంటారు. ఇలాంటి కల కూడా మీ జీవితంలో పురోగతిని సూచిస్తుందని చెబుతారు. ఈ కలను కూడా ఎవరితోనూ పంచుకోవద్దంటారు



వెండితో నిండిన కలశం కలలో కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. ఈ కల లక్ష్మీఅనుగ్రహాన్ని సూచిస్తుంది.స్వప్న శాస్త్రం ప్రకారం, ఈ కలను ఎవరికైనా చెబితే లక్ష్మీ కటాక్షం కలగదు అంటారు



ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా కానీ దేవుడు మాత్రం ఏదో సందర్భంలో కలలో తప్పనిసరిగా కనిపిస్తాడు. ఇలాంటి కలవస్తే కెరీర్ పరంగా మీకు మంచి జరగబోతోందని అర్థం. ఈ కల కూడా ఎవ్వరికీ చెప్పకూడదంటారు స్వప్న శాస్త్ర నిపుణులు



కలలో పండ్ల తోట కనిపించడం కూడా చాలా శుభసూచకం. సాధారణంగా గర్భిణిలకు కలలో పండ్ల తోట కనిపిస్తే అబ్బాయి, పూలతోట కనిపిస్తే అమ్మాయి పుడతారని చెప్పేందుకు సంకేతం అని అంటారు.



కలల శాస్త్రం ప్రకారం ఈ కలలను కూడా ఎవ్వరితోనూ పంచుకోరాదంటారు స్వప్న శాస్త్ర నిపుణులు.



Images Credit: Pixabay