చాణక్య నీతి: గొప్పవారు అయ్యేందుకు ఈ ఒక్క లక్షణం ఉంటే చాలు



శ్రుత్వా ధర్మ విజానాతి శ్రుత్వా త్యజతి దుర్మితిమ్
శ్రుత్వా జ్ఞానమవాప్నోతి శ్రుత్వా మోక్ష మవాప్నుయాత్



శ్రవణం(వినడం) ఎంత ముఖ్యమో చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు



పూజనీయ వ్యక్తులు, మహనీయుల నోటివెంట వచ్చిన వాక్కు వినడం వల్ల మనిషి అధోగతికి చేరకుండా తనని తాను రక్షించుకోగలడు



మహనీయుల మాటలు వినడం వల్ల జ్ఞానం,మోక్షం లభిస్తుంది



చదివినా మంచిదే కానీ నేరుగా జ్ఞాని అయిన గురువునుంచి వింటే జరిగే మంచి ఎక్కువగా ఉంటుంది



ప్రసిద్ధులైన మహాపురుషులంతా శ్రవణం వల్లనే చాలా విషయాలు తెలుసుకోగలిగారు



అందుకే శాస్త్రాలు చదివేంత అవకాశం లేనప్పుడు కనీసం విని అర్థం చేసుకుంటే మంచి జరుగుతుందని చాణక్యుడు శిష్యులకు బోధించాడు



Images Credit: Pinterest