ఆలయాల సమీపంలో నివాస స్థలాలు ఉండొచ్చా!



ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్సాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు. ఆ ఇంట్లో నిత్యం ఏదో విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి.



అందుకే ఆలయానికి మరీ దగ్గరగా కాకుండా కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిది.



వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండొచ్చు



శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు



అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరు



విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఇంటికి ఉత్రరం, వాయువ్యం వైపు ఉంటే వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.



ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు. దేవుడి ధ్వజం శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి.



Images Credit: Pinterest