ఈ 3 రుణాలు తీర్చేందుకే పెళ్లిచేసుకోవాలి!



హిందువులు పాటించే ప్రతి సంప్రదాయం వెనుకా ఓ ఆంతర్యం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిచేసుకోవడం అనేది మూడు రుణాలు తీర్చుకునేందుకే అని అంటారు పండితులు.



ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు
1. ఋషిఋణం
2. దేవఋణం
3. పితౄణం



ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి ఒక్కరి విధి. ఈ రుణాలు తీర్చకపోతే మరో జన్మ ఎత్తవలసి వస్తుంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. అందుకే ప్రతిక్కరూ రుణవిముక్తులు కావాలి. దానికి పరిష్కారమే పెళ్లి



బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః



ఋషి ఋణం
బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. వేదాధ్యయనం చేయాలి, దైవారాధనలో ఉండాలి, గురువులను పూజించాలి. పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.



దేవఋణం
యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి.



పితౄణం
సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి.



ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దని అర్థం. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవే దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు



Images Credit: Pixbay