పూజలో మందారాలను ఉపయోగించడం పరిపాటి కాళీ మాత ఆరాధనలో ఎర్రని పూలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాళికా దేవికి ఎర్రని మందారాలు చాలా ఇష్టమైనవి. మందార మొక్క ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు. ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉన్నవారికి కుజదోషం ఏర్పడుతుంది వీరు పరిహారంగా తప్పక ఇంట్లో మందారమొక్క పెంచుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న సూర్యుడికి నీటితో అర్ఘ్యం విడిచే సమయంలో మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి. ఎర్రని మందారాలు సమర్పించి కోరినకోరికలు నెరవేర్చమని లక్ష్మీ దేవిని కోరుకుంటే ఆమె తప్పక కటాక్షిస్తుంది. మందారపూల పరిహారం చేసుకున్న వారు ఆర్థిక సమస్యలు తీరుతాయి. కోరిన ఉద్యోగం పొందుందుకు మార్గాలు సుగమం అవుతాయి.