ABP Desam


దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా!


ABP Desam


రోడ్లపై షాప్స్ ముందు కొబ్బరికాయ చిప్పలు, నిమ్మకాయలు, గుమ్మడికాయ, మిరపకాయలు కనిపిస్తుంటాయి. అవన్నీ దుకాణాలకు దిష్టి తీసి పడేసినవే.


ABP Desam


'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిలిపోతుంది' అనే మాట వినే ఉంటారుగా. ఇంట్లో పెద్దవారి నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ ఎప్పటినుంచో ఉంది.


ABP Desam


ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై అనుకూల దిశగా పనిచేస్తే పర్వాలేదు కానీ వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడే చికాకు పెరుగుతుంది.


ABP Desam


తలనొప్పి ,వికారం, వాంతులు సహా నలతగా అనిపిస్తుంటుంది. దీనినే దిష్టి తగలడం అంటారు. దృష్టి నుంచి తగిలే దోషం కాబట్టి దిష్టి అంటారు. ఇలాంటి సమయంలో దిష్టి తీసి పడేస్తారు


ABP Desam


దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటినుంచీ అంతా చెడే జరుగుతుందనే భయంలో ఉంటారు. అందుకే రోడ్డుపై ఎక్కడైనా దిష్టితీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోతారు.


ABP Desam


వాస్తవానికి వీటిని తొక్కినంతమాత్రాన ఏమీ జరిగిపోదన్నది పండితుల మాట. ఎందుకంటే గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ..ఈ మూడూ మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట


ABP Desam


చెడుని ఆకర్షిస్తాయని చెప్పారు కదా వాటిని తొక్కితే చెడుజరుగుతుంది కదా అనే సందేహం వచ్చి ఉండొచ్చు..మీ సందేహం నిజమే కానీ ఈ మూడు వస్తువులూ చెడుని ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు


ABP Desam


అందుకే వాటిని తొక్కినంతమాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటున్నారు పండితులు...



Image Credit: Pixabay