News
News
వీడియోలు ఆటలు
X

ఇంట్లో బల్లులు ఉండటం మంచిదేనా? తోక ఊడిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది?

బల్లులు మిలియన్ల సంవత్సరాలుగా భూమి మీద బతుకుతున్న బలమైన జీవులు. బల్లి తత్వం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తరచి చూస్తే గొప్పగొప్ప పాఠాలు చాలా నేర్పుతుంది బల్లి.

FOLLOW US: 
Share:

రకరకాల చిన్నిచిన్న జీవులు మనతో పాటు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి అవి కనిపిస్తాయి. ఒక్కోసారి కనిపించవు. బొద్దింకలు, చీమలు, సాలీడ్లు, బల్లుల వంటివి ఎన్నో ఉంటూనే ఉంటాయి. అయితే కొన్ని ప్రాణులు ఇంట్లో కనిపిస్తే మంచి శకునమా కాదా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాటిలో బల్లి ఒకటి. బల్లి గురించి ప్రత్యేకంగా బల్లి శాస్త్రం అని ఒక శాస్త్రమే ఉంది. మరి బల్లి ఇంట్లో కనిపిస్తే మంచిదా? కాదా?

ఇంట్లో బల్లి కనిపిస్తే జీవితంలోకి ఏదో కొత్త విషయం రాబోతోందని అర్థమట. జీవితం ఒకసారి రిఫ్రెష్ అవుతుందనేందుకు సంకేతమని పండితులు చెబుతున్నారు. అదృష్టం, సంపద మీ దరి చేరబోతున్నాయనేందుకు గుర్తుగా ఇంట్లో బల్లి కనిపిస్తుందట.

కలలు భవిష్యత్తును తెలియజేసే సాధనాలు. ఇవి ఒక్కోసారి జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కొంత మందికి బల్లి కలలో కనిపిస్తుంది. కొంత మందికి ఎక్కడికి వెళ్తే అక్కడ బల్లులు లేదా బల్లుల బొమ్మలు లేదా ఏదో ఒక బల్లికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తుంటాయి. ఏదో ఒక నిగూఢార్థంతోనే బల్లులు ఇంట్లో కనిపిస్తాయి. ఒక్కోసారి యాదృశ్చికం కూడా కావచ్చు. ఆహారం, నీళ్లు, నీడ కోసం వెతుకుతూ ఇంట్లో చేరి ఉండవచ్చు కూడా. వాటి ద్వారా మీకు అందాల్సిన సందేశం అందే వరకు బల్లులు మీకు కనిపిస్తునే ఉంటాయి.

ఇంట్లో బల్లులు కనిపించాయంటే రకరకాల అర్థాలు ఉన్నప్పటికీ కొన్ని సాధారణ అర్థాల గురించి చెప్పుకుందాం.

  • దాదాపు అన్ని మతాలల్లోనూ అన్ని సంస్కృతుల్లోనూ బల్లులు ప్రత్యేకమైన ప్రతీకాత్మకత కలిగిన జీవులు. ఆధ్యాత్మిక సంకేతాలుగా కూడా భావిస్తారు.
  • ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైంది, ఆశ్రయం ఇచ్చేందుకు అనువైందని అర్థం. వ్యక్తిగా మీరు అన్ని రకాలుగా అంగీకారయోగ్యమైన వారని అర్థం.
  • సాధారణంగా బల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి. అయినా మీకు కనిపించింది అంటే కచ్చితంగా ప్రత్యేక కారణం లేకుండా ఉండదు.
  • కొత్త విషయాలేవో మీ జీవితంలోకి రాబోతున్నాయని అర్థం. కొత్త వ్యక్తుల రాకతో మీ జీవితం మరింత మెరుగవుతుందని అర్థం. అది మీకు పునర్జన్మ వంటిది కావచ్చు కూడా.
  • ఇంట్లో బల్లి కనిపించడం రాబోయే అదృష్టానికి, సంపదకు సంకేతంగా చాలా సంస్కృతుల్లో నమ్ముతారు. చైనీయులు బల్లిని బేబీ డ్రాగన్ గా భావిస్తారు. ఇది సంపద, కీర్తి, ప్రతిష్టలకు సంకేతంగా భావిస్తారు.
  • పాత మిత్రులు లేదా ఆత్మీయుల వ్యక్తుల గుర్తుగా కూడా బల్లి కనిపించవచ్చు. కొన్ని దేశాలలో ఇంట్లో ఆత్మీయుల మరణం తర్వాత బల్లి కనిపిస్తే శుభశకునంగా భావిస్తారు.
  • ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్నప్పటికీ బల్లులు భూమి మీద జీవించి ఉన్న ప్రాణులు. వీటి నుంచి మనుగడ కోసం జరిగే మార్పులను అంగీకరించడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి వాటనినింటికి సంకేతాలు. కష్టంలో ఉన్నపుడు బల్లి కనిపిస్తే మీరు మీ కష్టాన్ని విజయవంతంగా గట్టెక్కుతారని అర్థం. బల్లి తన మనుగడ కోసం జరిగే పోరాటంలో అవసరమైతే తోక వదులుకుంటుంది. ఇది జీవితం త్యాగాన్ని ఆశిస్తుందని చెప్పటానికి సంకేతం.

ఒక్కోసారి అపశకునం కూడా

  • ఇంట్లో బల్లి కనిపిస్తే ఒక్కోసారి రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కూడా కావచ్చు. మీరు తోక తెగిపోయిన బల్లిని మీ ఇంట్లో గమనిస్తే అది మీరు జీవితం కోసం చాలా కష్టపడుతున్నారనేందుకు ప్రతీక. మీ చుట్టు నమ్మక ద్రోహులు చేరారని కూడా మీరు తెలుసుకోవాలని కూడా అర్థం. కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వారు మీకు చెడు చేసే వారా మంచి చేసే వారా అనేది బల్లి సంకేతంలో కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి.

Also Read: భార్య, భర్తకు ఎటువైపు నిద్రపోవడం మంచిదో తెలుసా? పడక గదిలో ఈ నియమాలు తప్పనిసరి!

Published at : 27 Apr 2023 08:00 AM (IST) Tags: lizard good or bad lizard presence in home

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: బోర్, వాటర్ ట్యాంక్ మీ అపార్ట్ మెంట్ లో ఎక్కడున్నాయి, వాస్తు ప్రకారం ఎక్కడుండాలి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే

ఈ విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తే అదృష్టం మీ వెంటే

Vastu Tips In Telugu: ఈ వస్తువులు మీ చేతిలోంచి జారిపడితే అశుభం

Vastu Tips In Telugu: ఈ వస్తువులు మీ చేతిలోంచి జారిపడితే అశుభం

Vastu Tips In Telugu: వీటిని ఇంట్లో అలంకరించుకుంటే దుష్టశక్తులు దరి చేరవు

Vastu Tips In Telugu: వీటిని ఇంట్లో అలంకరించుకుంటే దుష్టశక్తులు దరి చేరవు

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!