చాణక్య నీతి: మనిషి హంసలా ప్రవర్తించకూడదు!



యత్రోదకం తత్ర వసన్తి హంసాః స్తయైవ శుష్కం వరివర్జయన్తి
న హసంతుల్యేన నరేణభావ్యమ , పునన్త్యజన్తే పునరాశ్రయన్తే



మనిషి..హంసలా ప్రవర్తించకూడదని ఈ శ్లోకం ద్వారా చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు



ఒకసారి ఎవరి నుంచైనా ఆశ్రయం పొందితే వారిని విడిచిపెట్టి వెళ్లకూడదు



ఏదో కారణం వల్ల విడిచిపెట్టి వెళితే తిరిగి అదే ఆశ్రయాన్ని కోరుకోరాదు



నిండుగా నీరున్న జలాశయాన్ని ఆవాసంగా చేసుకుంటుంది హంస



జలాశయం ఎండిపోగానే అది వదిలేసి మరో చోటుకి వెళ్లిపోతుంది



హంసలా..ఆశ్రయం ఇచ్చినవారిని సమయానికి వినియోగించుకుని వదిలేసి మళ్లీ అవసరం వచ్చినప్పుడు వచ్చి చేరరాదు



స్నేహం అయినా బంధం అయినా ఒక్కసారి ఏర్పరుచుకున్న తర్వాత ఎప్పటికీ వదిలేసుకోరాదు



Images Credit: Pixabay



Images Credit: Pixabay