పూర్ణకుంభంలా ఉండే గణనాథుడి దేహం పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు
ఏనుగు తల మేధస్సుకు సంకేతం, చిన్న కళ్ళు నిశిత పరిశీలనకు గుర్తు, వక్రతుండం ఓంకార ప్రణవనాదానికి ప్రతీక
చేటంత చెవులు అనవసరమైన విషయాలను చేటలా చెరిగేసి అవసరమైన విషయాలు మాత్రమే స్వీకరించాలని సూచన
చిన్న నోరు అతిగా మాట్లాడినందువల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేం ఉండదని సూచిస్తాయి
వినాయకుడు ధరించిన గొడ్డలి ఇహలోక బంధాలు శాశ్వతం కాదని వాటిని తెంచేసుకోవాలనేందుకు సూచన
ఏనుగు లాంటి ఆయన ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే వున్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. వేగంగా కదులుతుంది. అంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని అర్థం
వినాయకుడి పొట్టచుట్టూ ఉండే సర్పం శక్తికి సంకేతం
నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం
చేతిలో ఉన్న పాశం, అంకుశం సన్మార్గంలో నడిపించే సాధనాలు
గణేషుడికి ఇష్టమైన లడ్డూ ఆశయాలకు అనుగుణంగా అడుగేస్తే విజయం మీ సొంతం అవుతుందని అర్థం