వినాయక పూజలో తులసి వినియోగించరాదు - ఎందుకంటే!



వినాయకచవితి రోజు పూజలో ఎన్నో రకాల పత్రిలు సమర్పిస్తారు



వివిధ రకాల పూలతో పూజ చేస్తారు, కానీ తులసి పత్రి నిషిద్ధం అంటారు



సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడక పోవటానికి కారణం ఏంటంటే



ఒకసారి గంగాతీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమని కోరింది.



వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది



ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు



వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె మన్నించమని వేడుకుంది



వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆ తర్వాత తులసిగా జన్మిస్తావని చెబుతాడు



అందుకే వినాయకుడి పూజలో తులసిని వినియోగించరు



(Representational Images/Pixabay)