పెళ్లిలో బ్రహ్మముడి ఎందుకు వేస్తారు!



వివాహ సమయంలో వధూవరులిద్దరి చెంగులకు ముడివేసి ఆశీర్వదిస్తారు



ఈ ముడి సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వేదపండితుడి రూపంలో వేయిస్తాడని విశ్వసిస్తారు



జీవితాంతం కలిసి మెలిసి ఉండాలని చేయి పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదిక్షణం చేస్తారు



బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టే బ్రహ్మ ముడులు అంటారని పెద్దలు చెబుతారు



శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో బ్రహ్మ గ్రంధి ఉంటుంది. ఇవి ప్రత్యుత్పత్తికి సంబంధించినవి



కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, చిల్లర కలిపి వధూవరుల కొంగుకు కట్టి ఇద్దరికీ ముడివేస్తారు



కంద ఒకచోట పాతితే దినదినం వృద్ధి చెందుతూ ఎకరాలకు ఎకరాలు వ్యాపిస్తూ పోతుంది. అంటే కందలా వారి వంశం వృద్ధి చెందాలని ఉద్దేశం



అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని దీవిస్తూ లక్ష్మీస్వరూపం అయిన చిల్లర నాణాలు కడతారు



సౌభాగ్యాన్ని, శుభాన్ని సూచిస్తూ పసుపుకొమ్ము, ఖర్జూరం, ఆకు, వక్క కూడా కలపి వేదమంత్రాల నడుమ బ్రహ్మముడి వేస్తారు



Images Credit: Pinterest