Medaram Jatara 2024: మేడారం జాతరలో బెల్లమే బంగారం ఎలా అయింది!
Special Story On Medaram Bangaram : అమ్మవార్ల జాతర అంటే పిండివంటలతో నైవేద్యాలు, జంతుబలులు సహజం. అయితే మేడారం జాతరలో బంగారం ప్రత్యేకం. దీనివెనుకున్న ప్రచారంలో ఉన్న కథలేంటి?
Medaram Jatara 2024: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. భారీగా బంగారం (బెల్లం), చీరె-సారే, పూలు, పండ్లు, గాజులు, పసుపు-కుంకుమలతో, ముడుపులు కట్టి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఫిబ్రవరి 21న మొదలైన జాతర నాలుగు రోజులపాటూ సాగుతుంది. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన తర్వాత జాతరలో మూడో రోజు ప్రత్యేకతే వేరు. అయితే అమ్మవారి జాతర అంటే వివిధ రకాల పిండివంటలతో నైవేద్యాలు, జంతుబలులు సహజం. కానీ మేడారం జాతరలో మాత్రం బంగారం ప్రత్యేకం. ఇక్కడ బంగారం అంటే బెల్లం.
Also Read: నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం చేస్తారు - మూడోరోజు ఎందుకు ప్రత్యేకం!
దశాబ్దాలుగా ఇదే సంప్రదాయం
సమ్మక్క-సారలమ్మకు బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఆ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అని పిలుస్తుంటారు. మేడారం వెళ్లి వచ్చాక ఈ బంగారాన్ని ఊరంతా పంచుతారు. అసలు బెల్లం అనేమాట ఆ సమీపంలో వినిపించదు. అంతా బంగారం అనే పిలుస్తారు. ఇంతకీ బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారిక్కడ? అమ్మవార్లకు నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం వెనుకున్న కథలేంటి?
Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!
గిరిపుత్రులకు అదే ఖరీదైన వస్తువు
అప్పట్లో మేడారం జాతరను కేవలం ఆ సమీపంలో ఉన్న ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారు. బయట ప్రపంచానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగించేవారికి వివిధ రకాల నైవేద్యాల గురించి తెలియదు కూడా. ఆహారంలో ప్రధానంగా భావించే బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. అది కూడా వారానికో నెలకో ఓచోట సంతలు జరిగేవి... ఆ సంతలకు కిలోమీటర్ల దూరం నడిచివచ్చి ఉప్పు, బంగారం కొనుక్కుని వెళ్లేవారు. ఉప్పు కన్నా బెల్లం ధర ఎక్కువే కావడంతో బెల్లాన్ని బంగారంగా భావించేవారు. అలా బంగారం బంగారం అని పిలవడం అలవాటైంది. ఆదివాసీలు కొనుగోలు చేసే బెల్లం పూర్వ కాలంలో మేడారం జాతరను కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీలు మాత్రమే జరుపుకునే వారట. పైగా అప్పటిలో వారి ఆచారాలు కూడా కాస్త భిన్నంగా ఉండేవట. బెల్లం, ఉప్పును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారట. కాగా, వారు బెల్లానికి ఎక్కువ విలువను ఇవ్వడంతో పాటు.. ఖరీదైనదిగా భావించేవారట. అప్పట్లో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి రాకపోవడంతో సమ్మక్క, సారలమ్మకు తాము ఖరీదైనదిగా భావించే బెల్లాన్ని సమర్పించే వారు. అలా బెల్లాన్ని బంగారం అని పిలవడం కొనసాగుతూ వచ్చింది. కోరిన కోర్కెలు నెరవేరితే మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా నిలువెత్తు బెల్లం సమర్పిస్తారు. అక్కడి నుంచి ఎంతో కొంత బెల్లాన్ని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వారికి పంచుతారు.
Also Read: నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు కాలక్రమేణా ఇలా మారాయ్!
మరో కథనం ప్రకారం
ఎలాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లో ( ఇప్పటికీ చాలా గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు లేవనుకోండి).. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు. ఆసమయంలో మార్గ మధ్యలో ఆకలి తీరేందుకు, తక్షణ శక్తి కోసం బెల్లం పానకంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేవారు. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు ఖరీదైన ఆహారం కూడా వారికి. అందుకే అంత విలువైన ఆహారాన్ని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం మొదలైందని కూడా చెబుతారు...
Also Read: జువ్విచెట్టు మొదలు తేనెతుట్ట వరకూ మేడారం జాతరలో ప్రతి ఘట్టమూ అద్భుతమే!