Makar Sankranti 2022: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...

సంక్రాంతి వస్తే చాలు నిత్యం కిటకిటలాడే మహానగరాలు వెలవెలబోయి.. పల్లెటూర్లనీ కళకళలాడతాయి. మరే పండుగకూ లేనంత హడావుడి సంక్రాంతి సొంతం. అసలు సంక్రాంతికి పల్లెటూర్లకు వెళ్లాలని ఎందుకు ఫిక్సైపోతారు…

FOLLOW US: 

లేత చివురులపై మంచు ముత్యాలు...ఉదయభానుడి లేలేత కిరణాలు, కోడి కూతల సుప్రభాతాలు, తొలకరి మట్టి వాసనలు, ఎర్రగా పండిన గోరింటాకు చేతులు, వెచ్చని బావి నీళ్ళు, బంతి చామంతిల కమ్మని సువాసనలు, వేప చెట్ల తీపి గాలులు, రంగవల్లులూ, గంగిరెద్దులూ, హరిదాసులు.. చదివితుంటేనే వామ్మో ఇన్నా అనిపిస్తోంది కదా..మరి ఇన్ని ఆనందాలన్నీ అనుభవిస్తే ఇంకెలా ఉంటుంది...కాంక్రీట్ జంగిల్లో ఇవన్నీ సాధ్యమయ్యేనా..అందుకే సంబరాల ఉత్సాహాన్ని క్షణం క్షణం రెట్టింపు చేసే పల్లెలంటే అందరీ అంతిష్టం. 

Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
ప్రకృతితో మనిషి మమేకమయ్యే అసలైనపండగ సంక్రాంతి. చల్లని గాలులు, పచ్చని పైరులు, ధాన్యపు రాశులతో నిండే ఇళ్లూ. ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు, డూ డూ బసవన్నల నృత్యాలు, ఉషోదయాన హరిదాసులు చేసే సందడి...ఇవన్నీ పల్లెకే సొంతమైన అందమైన దృశ్యాలు. ఇంకా  భోగిమంటలు, భోగిపళ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగిది. అందుకే పల్లెకు ఎంతెంత దూరంలో ఉన్నా..సంక్రాంతికి పల్లెకు పరుగులుతీస్తారు. ఊరుని తలుచుకోగానే వచ్చే ఆనందం ఒకెత్తైతే.... పుట్టిన ఊరి మట్టివాసన తగలగానే ఆ ఉత్సాహమే వేరు. పంటపొలాల చుట్టూ పరుగులు పెట్టిన జ్ఞాపకాలు, చెరువుల్లో ఈతలు, చిన్ననాటి స్నేహితులతో ముచ్చట్లు...ఇలా ఎన్నో తీపి గుర్తులను మనతో పాటూ తీసుకెళ్లే పండుగే సంక్రాంతి.  

Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
సంక్రాంతి పండుగ వచ్చేనాటికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తుంది. రైతు కళ్లు ఆనందంతో చెమరుస్తాయి. ఆ ఆనందం పండుగకు కొత్త కళ తెస్తాయ్. అన్నదాత ఆనందంగా ఉంటే ప్రతిరోజూ పండుగే అన్న మాట కూడా వాస్తవమేనేమో అనిపిస్తుంది. దుక్కు దున్నినప్పటి నుంచీ యజమానికి సహకరించే ఎద్దులు, పండిన పంటను బస్తాలకెత్తి ఇంటికి చేర్చేప్పుడు సంబరంగా పరుగులు తీస్తాయ్. తనని పూజిస్తున్న యజమానికి వరాలిచ్చాం అన్నంత ఆనందంగా కనిపిస్తాయ్. ఇంకా  భోగిమంటలు, రంగు ముగ్గులు,గొబ్బెమ్మలు,ఇల్లంతా అలంకరణలు, పాడిపశువుల పూజలు...ఇలా మలుపూ ఆసక్తే....ప్రతిక్షణమూ సంబరమే. అసలు పండుగకి ఊరెళ్లేదే....పల్లెకే పరిమితమైన సంబరాన్ని చూసేందుకు.

Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండిPublished at : 13 Jan 2022 02:39 PM (IST) Tags: Sankranthi 2022 Sankranti 2022 2022 calendar calendar 2022 makar sankranti 2022 makar sankranti makar sankranti 2022 date makar sankranti kab hai makar sankranti mahiti 2022 makar sankranti 2022 kab hai makar sankranti 2022 date time 2022 sankranthi makar sankranti vahan 2022 sankranthi date 2022 2022 sankranthi date bhogi date 2022 bhogi date 2022 telugu sankranti 2022 bhogi bhogi bhogi 2022 date makara sankranthi 2022 date 2022 makara sankranthi date sankranthi date 2022 telugu bhogi pongal 2022 date bhogi muggulu bhogi kundala muggulu bhogi 2022 ap 2022 bhogi bhogi 2022 in telugu bhogi 2022

సంబంధిత కథనాలు

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Today Panchang 19th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్తర శత నామావళి

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022:  ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా

Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా