By: ABP Desam | Updated at : 12 Jan 2022 07:39 AM (IST)
Edited By: RamaLakshmibai
Sankranthi 2022
అప్పటి వరకూ దక్షిణదిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తన దిశను మార్చుకుని ఉత్తరదిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకూ ఉన్న వాతారణంలో పూర్తిగా మార్పులు చోటుచేసుకుంటాయి. సంక్రాంతిని సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో పెద్దగా మార్పులుండవు. ఇంతకీ సంక్రాంతినే పెద్దపండుగని ఎందుకంటారు.. పాటించే ప్రతిచర్య వెనుక అర్థం, పరమార్థం ఏంటంటే...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటూ రైతులు మనసు నిండుగా ఉంటుంది. ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకుని తినరు..ఎందుకంటే.. కొత్త బియ్యం అరగదు. అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు(సకినాలు) చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్టు ఉంటుంది.. జీర్ణ సమస్యలు తలెత్తవు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. అందుకే పొంగల్ అని పిలుస్తారు. మరోవైపు పంటని చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా అన్నీ చేసి నైవేద్యం పెట్టి, ప్రకృతిని, పశువులను పూజిస్తారన్నమాట.
Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
నువ్వులతో పిండి వంటలెందుకు
సంక్రాంతి రోజు చేసే పిండివంటలన్నింటిలో నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు. చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండివంటలు చేసి పంచుకుంటారు. సంక్రాంతి సమయంలో నువ్వులు వాడకం వెనుక ఆరోగ్యరహస్యాలెన్నో ఉన్నాయి. నువ్వులలో ఉండే అధికపోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి. అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో నువ్వులని తినడం వల్ల, మారుతున్న వాతావరణానికి శరీరం అలవాటు చేసినట్టవుతుంది.
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
పెద్ద పండుగే కాదు పెద్దల పండుగ కూడా
సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణం విడవటం ఆచారంగా వస్తోంది. మోక్షాన్ని ప్రసాదించే ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దలకు సద్గతులు కలగాలని కోరుకుంటూ తర్పణాలను విడుస్తారు. అందుకే సంక్రాంతి పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్దల పండుగగా కూడా నిలుస్తుంది.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
స్నేహభావం
ఎప్పుడూ మనమే అనే భావన కన్నా..నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్నిస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెబుతారు. హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవారు... పండుగ శోభను పెంచేవారెందరో. వీళ్లందరికీ తోచిన సహాయం చేస్తారు. ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు.
ఇంకా సృజనాత్మకతని వెలికితీసే సంక్రాంతి ముగ్గులు,బొమ్మల కొలువులు, గాలిపటాలు...ఇలా సంక్రాంతి చుట్టూ ఎన్నో ఆచారాలు అద్భుతంగా అనిపిస్తాయి. అందుకే ఆ మూడు రోజులు మాత్రమే కాదు నెల రోజుల ముందునుంచీ సందడి మొదలైపోతుంది. మరి సంక్రాంతి పెద్ద పండుగ కాక మరేంటి...
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం
CM KCR: నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Breaking News Live Updates: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం