News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sankranthi Bramhosthavalu: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 7 రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాల విశేషాలు చూద్దాం..

FOLLOW US: 
Share:

ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగే క్షేత్రం…12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం. పరమేశ్వరుడు గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లి కార్తీకేయుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి. ఇక్ష్వాకులు,రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం శ్రీశైలం. ఈ  మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకుని ఈనెల 12 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.   7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని 15వ తేదీ మకర సంక్రాంతి రోజున భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించనున్నామన్నారు

Also Read: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...

  • ఈనెల 12 న ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు
  • అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన ఏడు గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు
  • బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి, వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం ఉంటేనే దర్శనాలకు అనుమతి
  • కరోనా విజృంభిస్తున్న సమయంలో చంటిబిడ్డల తల్లులు శ్రీశైలం యాత్ర వాయిదా వేసుకుంటే మంచిది
  • దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి
  • మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు,మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహణ
  • ఉత్సవాల సందర్భంగా 12 నుంచి 18వ తేదీ వరకు.. ఆలయంలో రుద్రహోమం, చండీహోమం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, స్వామి-అమ్మవార్ల కల్యాణం తాత్కాలికంగా నిలిపివేత

Also Read:  మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
ఈ మధ్యే శ్రీశైలంలో  స్పర్శ దర్శనం వేళలు పెంచుతున్నట్లు ఆలయ ఈఓ లవన్న చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు సాధారణ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.  మహాశివరాత్రి పర్వదినానికి ముందు ఐదు రోజులపాటు గర్భాలయ స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 

Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Jan 2022 12:16 PM (IST) Tags: srisailam srisailam sankranthi brahmotsavam sankranti brahmotsavam srisailam brahmotsavam sankranthi brahmotsavam srisailam sankranti brahmotsavam sankranti brahmotsavam in srisailam maha shivaratri brahmotsavam in srisailam srisailam sankranthi brahmotsavam ends srisailam sankranthi brahmotsavam live srisailam sankranthi brahmotsavam 2022 srisailam sankranthi brahmotsavam today srisailam makara sankranthi brahmotsavam sankranthi brahmotsavam 2022 in srisailam

ఇవి కూడా చూడండి

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌కు ఇష్ట‌మైన నైవేద్యాలు ఇవే.. తొలిరోజు ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌కు స‌మ‌ర్పించే నైవేద్యం ఏమిటో తెలుసా?

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌కు ఇష్ట‌మైన నైవేద్యాలు ఇవే.. తొలిరోజు ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌కు స‌మ‌ర్పించే నైవేద్యం ఏమిటో తెలుసా?

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!

Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!

Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే మీ వంశం వృద్ధి చెందుతుంది!

Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే  మీ వంశం వృద్ధి చెందుతుంది!

Ancestors In Dream: పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!

Ancestors In Dream:  పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే  అది దేనికి సంకేతం!

టాప్ స్టోరీస్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!