Bhogi 2022 : భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
సంక్రాంతి అంటే .. నెల ముందు నుంచే సందడి మొదలైపోతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళ రాకతో సంబరాలు అంబరాన్నంటుతాయి. మొదటి రోజు భోగి
భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజు భోగి. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి అని చెబుతారు. ఈ భోగి పండుగ వస్తూవస్తూ ఏడాదికి సరిపడా ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తుంది. ఇక్కడి తోనే భోగం మొదలైపోతుందన్నమాట. చెప్పుకోవాలంటే భోగి రోజు సంబరమంతా పిల్లలదే. భోగిమంటలతో తెల్లవారక ముందునుంచీ మొదలయ్యే పండుగ సమయం తెలియనంత తొందరగా ముగిసిపోతుంది. సంక్రాంతికి ముందొచ్చేది మాత్రమే భోగి కాదు...ఏ పండుగకు అయినా ముందు రోజు భోగి అనే అంటారు. అంటే పండుగకు సిద్ధమయ్యే రోజని అర్థం. శివరాత్రి ముందురోజు శివభోగి, నరక చతుర్దశయితే దీపావళి భోగి, మహర్నవమి దసరా భోగి...ఇలా ప్రతి పండుగకు ముందు రోజుని భోగి అనే అంటారు. అన్నటికన్నా ధనుర్మాసం ఆఖరి రోజు వచ్చే భోగి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టం. నెలరోజుల పాటూ గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతాన్ని మెచ్చి స్వయంగా రంగనాథుడే దివినుంచి భువికి దిగివచ్చిన రోజు. అందుకే భోగి రోజు పొద్దున్నే ఆవుపేడతో లోగిళ్లలో కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు, అందులో గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.
Also Read: మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేస్తారక్కడ..
భోగి మంటలు
భోగిరోజు ప్రధానమైనవి భోగిమంటలు. ఆవు పేడతో చేసిన పిడకలు, కర్రలు, ఇంట్లో పాత వస్తువులు అన్నింటినీ అగ్నికి ఆహుతి చేస్తారు. అంటే మనలో చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల వెనుకున్న ఆంతర్యం. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి భోగిమంటలు వేసుకోమంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి వచ్చే పురుగులు కూడా ఇళ్లలో చేరకుండా తిప్పికొట్టేందుకు భోగిమంటలు ఉపయోగపడతాయంటారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
భోగిపళ్లు
తెల్లవారు జామున భోగిమంటల దగ్గర చిన్నారులు ఎంత సంబరపడాతారో..సాయంత్రం భోగిపళ్లు పోసేటప్పుడు కూడా ఆ ఉత్సాహం అలాగే కొనసాగుతుంది. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, కూర్చోబెట్టి భోగిపళ్లు పోస్తారు. ఇలా చేయడం వెనుక కారణం ఏంటంటే.. రేగు చెట్టుకు బదరీ వృక్షం అని పేరు. రేగు చెట్లు, రేగు పండ్లు శ్రీమన్నారాయణుడి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. అందుకే సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని పెద్దల విశ్వాసం. మన కంటికి కనిపించని బ్రహ్మ రంధ్రం తలపై భాగంలో ఉంటుందని.. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని కూడా చెబుతారు. ఎందుకంటే రేగు పండ్లు సూర్య కిరణాల్లో ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. అందుకే రేగుపళ్లు తలపై పోయడం వలన వీటిలో విద్యుశ్చక్తి ఆరోగ్యాన్నిస్తుందని అంటారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: ఈ టైప్ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి