Laughing Buddha: ఈ టైప్ లాఫింగ్ బుద్ధ మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందట

గుండ్రటి తల, బాన పొట్ట, నవ్వు ముఖం…ఇంకెవరు లాఫింగ్ బుద్ధ. ఈయన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుందంటారు. మరి రకరకాల రూపాల్లో కనిపించే ఈ బొమ్మల్లో ఏ రూపం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే..

FOLLOW US: 

లాఫింగ్ బుద్ద ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ ఉంటాయని చెబుతారు. ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా లాఫింగ్  బుద్ధని  పెడితే అంతా శుభమే అని విశ్వసిస్తారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు.. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. 

లాఫింగ్ బుద్ద గురించి ఎన్నో కథలు
శతాబ్దం కిందట చైనాలో హొటై పేరుతో బౌద్ధ బిక్షువుగా తిరిగేవాడట లాఫింగ్ బుద్ధ. భుజాన జోలె, చేతిలో బిక్షాప్రాతతో ఉండే ఆయన వద్దకు పిల్లలు వచ్చి ఏమడిగినా జోలె నుంచి తీసిచ్చేవాడట. ఉదయాన్నే ఆయన ముఖం చూసిన వారికి ఆ రోజంతా మంచే జరిగేదట. జపాన్‌లో లాఫింగ్‌  బుద్ధాను ఏడుగురు  అదృష్ట దేవుళ్లలో ఒకరుగా పూజిస్తారు. థాయ్‌లాండ్‌లోనూ భలే క్రేజ్ ఉందండోయ్.  లాఫింగ్‌  బుద్ధను సంస్కృతంలో మైత్రేయ అని సంబోధిస్తారు. ఎంచక్కా నవ్వే ఈ విగ్రహం ఎక్కడుంటే అక్కడ కష్టాలుండవని..అందుకే శుభకార్యాలకు ఈ బొమ్మను బహుమతిగా  ఇస్తుంటారని చెబుతారు. విభిన్న రూపాల్లో ఉండే ఈ విగ్రహాల్లో ఒక్కో రూపం ఒక్కో రకమైన అదృష్టాన్ని కలిగిస్తుందంటారు. 

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
నిల్చున్న లాఫింగ్ బుద్ధ
రెండు చేతులు పైకెత్తి.. వాటిలో బంగారు బంతులు మోస్తూ కనిపించే  బుద్ధ ప్రతిమ ఇంట్లో ఉంటే ఆరోగ్యప్రదాతగా భావిస్తారు. ఇలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే దీర్ఘాయుష్షు కలుగుతుందట. అయితే ఈ ప్రతిమ తూర్పు దిశకు అభిముఖంగా ఉంచితే మంచిదంటారు. 

బంగారు నాణేలతో కూర్చున్న లాఫింగ్ బుద్ధ
బంగారు నాణేలతో  తిష్టవేసి కూర్చున్న లాఫింగ్‌ బుద్ధా ఇంట్లో ఉంచితే అదృష్టం  దరిద్రం పట్టినట్టు పడుతుందట. ఈ ప్రతిమ ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు.. సిరిసంపదలు సమృద్ధిగా కలిగిస్తుందట. ఈ ప్రతిమను వాయవ్య దిశలో  లేదా దక్షిణాభిముఖంగా ఉంచాలని సూచిస్తారు వాస్తు పండితులు. 

దర్జాగా కూర్చున్న బుద్ధ
డ్రాగన్‌ టార్టాయ్ పై దర్జాగా కూర్చున్న బుద్ద ఇంట్లో ఉంటే.. కెరీర్లో ఊహించని గ్రోత్ ఉంటుందట. ఇలాంటి విగ్రహాన్ని ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. ఆఫీస్‌ క్యాబిన్‌లో మీ కుర్చీకి వెనుకవైపు ఉంచితే కెరీర్‌ విజయవంతంగా సాగుతుందని చెబుతారు నిపుణులు. ఇంట్లో అయితే  మాత్రం ఉత్తర దిశలో ఉంచాలి. 

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
పిల్లల్ని ఎత్తుకున్న బుద్ధ
చంటిపిల్లలను ఎత్తుకుని కనిపించే లాఫింగ్ బుద్ధ ప్రతిమ మీ ఇంట్లో ఉంటే ఇంటిల్లపాదీ సుఖ సంతోషంగాలతో ఉంటారట. పిల్లలు ఆరోగ్యంగా ఉండడమే కాదు విద్యలో రాణిస్తారని చెబుతారు. ఈ ప్రతిమను హాల్‌లో గానీ, బెడ్‌ రూమ్‌లో గానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది. 

క్రిస్టల్ లాఫింగ్ బుద్ధ
క్రిస్టల్‌తో తయారు చేసిన లాఫింగ్‌ బుద్ధా జ్ఞానాన్ని పెంచుతుంది. ఈ ప్రతిమను స్టడీ రూమ్‌లో ఉంచితే దాని నుంచి వచ్చే పాజిటివ్‌ సిగ్నల్స్‌ పిల్లల మనసును ప్రశాతంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇంటి యజమాని ఆదాయం పెరగాలంటే ఈ విగ్రహాన్ని హాల్‌లో ఈశాన్య దిశలో ఉంచాలి. 

ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ కింద పెట్టకూడదట. అలా చేస్తే అనర్థాలు జరిగే ప్రమాదం ఉందంటారు ఫెంగ్ షూయ్ నిపుణులు. ఆఫీసులో, ఇళ్లలో ఎక్కడైనా సరే ద్వార బంధానికి దగ్గర్లో, కానీ ఎదురుగా గానీ సరైన స్ధలాన్ని నిర్ణయించి భూమి కనీసం అడుగున్నర ఎత్తులో ఉంచాలట. 

Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Jan 2022 11:04 AM (IST) Tags: buddha laughing buddha mystery of laughing buddha laughing buddha story laughing buddha placement laughing buddha statue types of laughing buddha laughing laughing buddha ke fayde laughing buddha ki kahani laughing buddha feng shui laughing buddha for money laughing buddha with a fan laughing buddha with a bowl laughing buddha for business laughing buddha for students laughing buddha with a sack or bag

సంబంధిత కథనాలు

Horoscope 2nd July  2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం

Panchang  2nd July 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం

Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!

Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

Jagannath Rath Yatra 2022: పూరీ జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

టాప్ స్టోరీస్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Meena: తప్పుడు ప్రచారం చేయొద్దు - భర్త మరణంపై మీనా ఎమోషనల్ పోస్ట్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్

Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Vishal No Politics :  కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే

Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !

Rahgurama :  నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా -  సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సలహా !