Spirituality: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...

టైమ్ టు టైమ్ తినేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఎలాంటి భోజనం చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా.. అసలు మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయంటారు పండితులు. అవేంటో...ఎందుకో తెలుసుకోండి....

FOLLOW US: 

నిత్యం మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలు
1.అర్ధ దోషం
2.నిమిత్త దోషం         
3.స్ధాన దోషం
4.గుణ దోషం   
5. సంస్కార దోషం

1.అర్ధ దోషం
ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఆ శిష్యుడికి డబ్బు మూట ఇవ్వడం చూశాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ గదిలో మూట చూసిన సాధువు మనసులో దుర్భుద్ధి కలిగింది. అందులోంచి కొంత మొత్తాన్ని తీసి తన సంచీలో దాచేసి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు పూజా సమయంలో తాను చేసిన దొంగతనం గుర్తొచ్చి సశ్చాత్తాపం చెందాడు. తను శిష్యుడి ఇంట్లో  దోషంతో కూడిన భోజనం చేయడం వల్లే తనకా దుర్భుద్ధి కలిగిందని..ఆ ఆహారం జీర్ణమై మలంగా విసర్జించిన తర్వాత మనసు నిర్మలమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బు తీసుకుని శిష్యుడి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పి ఇచ్చేసి..ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు. శిష్యుడు తలవంచుకుని, "నన్ను క్షమించండి, స్వామి!  ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు" అన్నాడు. 
అంటే సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్థదోషం.  

Also Read: ఈ రాశుల వారికి ఈ సంక్రాంతి ప్రత్యేకంగా ఉంటుంది, జనవరి 09 నుంచి 15 వరకూ వారఫలాలు..
2.నిమిత్త దోషం
భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం  ముగిసే వరకూ అంపశయ్యపై ప్రాణాలతో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడికి మంచి విషయాలు బోధించాడు. అప్పుడు ద్రౌపది కి ఓ సందేహం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనుడిని ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు అనుకుంది. ఆ ఆలోచన గ్రహించిన భీష్ముడు 'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం తిన్నాను. నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. శరాఘాతాలతో  ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి పవిత్రుడినయ్యా..అందుకే ఇప్పుడు మంచి మాటలు చెప్పగలుగుతున్నా అన్నాడు. 

అంటే..మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి స్వభావం కలిగి ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు ముట్టుకోకూడదు. ఆహారం మీద దుమ్ము, తల వెంట్రులకు పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం అసహ్యాన్ని కలిగిస్తే.. వక్రబుద్ధి, చికాకుతో వండిన భోజనం చేస్తే దుష్ట గుణాలు కలుగుతాయి. చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చింది  తినడం వల్ల మంచి గుణం నశించి నిమిత్త దోషం కలుగుతుంది. 

Also Read: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
3. స్ధాన దోషం
దుర్యోధనుడు ఓసారి  యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సులభ సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏం పెట్టాలా అనే ఆలోచించి, ఆనందం-తొందరపాటు ఏకమైన ఆ క్షణం అరటి పండు ఒలిచి పండుకి బదులు తొక్క చేతికి అందించింది.  కృష్ణుడు దాన్ని తీసుకుని సంతోషంగా తిన్నాడు. ఇదిచూసిన విదురుడు భార్య సులభ వైపు కోపంగా చూడడంతో స్పందించిన కృష్ణుడు... "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటా అన్నాడు. 

ఎక్కడైతే వంట చేస్తారో అక్కడంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. వంటచేసేవారు,వండించేవారు కూడా మంచి మనసు కలిగి ఉండాలి. వడ్డించేటప్పుడు అంతే ప్రేమగా వడ్డించాలి. వంట చేసే సమయంలో అనవసర చర్చలు, వివాదాలు , అరుపులు కేకల మధ్య చేసిన వంట శరీరానిక మంచి చేయదు. యుద్ధరంగం, కోర్టులు, రచ్చబండలు ఉన్న చోట్ల వండిన వంటలు అంత మంచివి కాదంటారు పండితులు. 

Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
4.గుణ దోషం 
మనం వండే ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని మాయలో పడేస్తుంది,స్వార్థాన్ని పెంచుతుంది. 

5. సంస్కారదోషం 
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Jan 2022 08:18 AM (IST) Tags: Bhagini Hastha Bhojanam bhojanam bhojanam ela cheyali bhojana niyamalu bhojanam rules bhojanam ela pettali shani dosha shani dosha nivarana shani dosha nivarana mantra bhojanam niyamalu bhojana mantram bhojanam chesetappudu cheyakudani panulu bhojana slokam shani dosha nivarana in telugu shani dosha pariharam in telugu dosha nivarana pooja jathaka dosham nivarana arati aaku bhojanam bojanam vidhanam shani graha dosha nivarana in telugu

సంబంధిత కథనాలు

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

Tirumala Brahmotsavam 2022 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత అత్యంత వైభవంగా

Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 2nd July  2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Panchang 2nd July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం

Panchang  2nd July 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణ స్తోత్రం

Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!

Jagannath Rath Yatra 2022: పూరి జగన్నాథుడి విగ్రహాల్లో ఓ బ్రహ్మపదార్థం ఉంటుంది, అదేంటో తెలుసా!

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

టాప్ స్టోరీస్

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Defence Ministry:  ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్