News
News
X

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఈ సంక్రాంతి ప్రత్యేకంగా ఉంటుంది, జనవరి 09 నుంచి 15 వరకూ వారఫలాలు..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

జనవరి 09 నుంచి  15 వరకూ వారఫలాలు..

మేషం 
వారం ఆరంభంలో కన్నా వారం మధ్యలో పనులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వారం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులను కలవడంతో సంతోషంగా ఉంటారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసొస్తాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం వద్దు. కుటుంబంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు వారం చివర్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగాసాగుతుంది. రియల్ ఎస్టేట్ లో ఉండేవారికి పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు. 

వృషభం
ఈ వారం వృషభరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు అంత సులువుగా పూర్తి కావు...అయినప్పటికీ వారాంతానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రుణ విముక్తి ప్రయత్నాలు ఫలించవు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారాంతంలో బంధుమిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులతో వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.  నిరుద్యోగులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టపోతారు. ఖర్చులు పెరుగుతాయి. 

మిథునం
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. వారం మధ్యలో స్వల్ప ఒడుదుడుకులు ఎదురవుతాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వారం మద్యలో  అనారోగ్య సూచనలున్నాయి.  విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.  ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి కలిసొస్తుంది. 

Also Read: మీ సరదా సరే..దయచేసి భోగి మంటల్లో ఇవి మాత్రం వేయకండి..
కర్కాటకం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వచ్చిన  అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ బలహీనతలను బయటపడనివ్వకండి. కుటుంబ సభ్యుల వ్యవహారశైలి చికాకు కలిగిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది,. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి గతంలో ఉన్న  బాధలు తొలగిపోతాయి. వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. 

సింహం 
ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదరవుతాయి. ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు.  అనవసర తగాదాల వల్ల పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఉదర సంబంధ సమస్యలుంటాయి. వారం చివర్లో చేసే పనుల్లో పురోగతి ఉంటుంది.  నిరుద్యోగుల ప్రయ్తనాలు ఫలించవు. సహోద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.  వ్యాపారులకు లాభాలొస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారి మిత్రులే ద్రోహం చేస్తారు.

కన్య
వారం ప్రారంభంలో ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి, దుర్యసనాల బారిన పడే ప్రమాదం ఉంది. అరుగుదల మందగిస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు అంత అనకూలంగా ఉండదు.  ఉద్యోగులకు ఇష్టంలేని చోటుకి బదిలీలు లేదా కొన్ని ఇబ్బందులు తప్పవు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి తక్కువ శ్రమలో ఎక్కువ లాభాలొస్తాయి. 

Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
తుల
తుల రాశివారికి ఈ వారం మంచి ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. సంపాదన పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోంగా గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనాల కొనుగోలు ప్రయత్నం వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు పెద్దగా లాభించవు. వారం చివర్లో ఎదురు దెబ్బలు తగిలే వీలుంది. అనవసర గొడవల్లో ఇరుక్కుంటారు. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ధనలాభం, గౌరవ మర్యాదలు దక్కుతాయి. 

వృశ్చికం 
తలపెట్టిన పనులు కొన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ పూర్తవుతాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వారం మధ్యలో శుభఫలితాలు పొందుతారు. కొత్త ప్రణాళికలను అమలు చేయండి. అప్పులు చెల్లిస్తారు.  కొత్త వస్తువులు కొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. జీవితభాగస్వామి వల్ల సంతోషంగా ఉంటారు.  విద్యార్థుల కృషికి తగ్గ ఫలితం దక్కదు.వృత్తి ఉద్యోగాల్లోని వారికి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. 

ధనస్సు
ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతాయి. ప్రతి కార్యమూ విఫలమవుతుంది. ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఎవరితోనైనా విరోధం వచ్చే అవకాశం ఉంది.  మానసిక అశాంతి, శారీరక అనారోగ్యం ఉంది జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో సకల సౌఖ్యాలనూ పొందుతారు. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. విద్యార్థుల  ప్రతిభకు గుర్తింపు లభించదు. నిరుద్యోగులకు ఆందోళన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అనవసర వ్యవహారాల్లో తలదూర్చి బాగా నష్టపోతారు. వ్యాపార రంగంలోని వారికి ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. 

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
మకరం
దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయం మెరుగు పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మిత్రులు సహకరిస్తారు. వారం మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి.  స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి, ఉద్యోగాల్లోని వారు ఊహించని కష్టనష్టాలను ఎదుర్కొంటారు. 

కుంభం
ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన పనులు పూరతిచేయడానికి శ్రమించాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల ఇబ్బందులు వస్తాయి. బంధువులతో అకారణ విరోధాలు సూచిస్తున్నాయి. ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు లాభించవు. జీవితభాగస్వామి వల్ల ప్రశాంతతను పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.  నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం దక్కుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో చక్కటి పురోభివృద్ధి ఉంటుంది. 

మీనం
మీన రాశివారికి భలే కొలిసొస్తుంది.  ఏ పని తలపెట్టినా అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఇరుగుపొరుగు వారితో గొడవలు రావచ్చు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read:  11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: వారంలో ఈ రోజు తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు, ఆపదలు తప్పవట…
Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 
Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Jan 2022 01:02 PM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 2022 Horoscope Weekly Weekly Horoscope January 9th to January 15th

సంబంధిత కథనాలు

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Happy Raksha Bandhan 2022: యుగ యుగాలను దాటుకుని వచ్చిన రాఖీ పౌర్ణమి , మొదటి రాఖీ ఎవరు ఎవరికి కట్టారంటే!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

టాప్ స్టోరీస్

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Zoonotic Langya virus:  చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!