Tirumala: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
మధ్యతరగతి భక్తుల కోసం మరో మినీ పధకం ప్రవేశ పెట్టాలనుకున్న టీటీడీ ఆలోచన వర్కౌట్ అయ్యేనా.. ఈ మేరకు సిద్ధమవుతున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయా...ఇది అమల్లోకి వస్తే సామాన్య భక్తుల కల నెరవేరినట్టేనా..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడి దర్శనార్థం భక్తులు పోటీపడతారు. రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చుని, పడిగాపులు పడైనా స్వామిని కళ్లారా చూస్తే చాలనుకుంటారు. శ్రీ వేంకటేశుడి దర్శనంతో సకల పాపాలు తొలగి పుణ్యం వస్తుందని భావిస్తారు. స్వామివారి దర్శనానికి ఎన్నో మార్గాలున్నాయి. సామాన్య భక్తులకు టీటీడీ సర్వదర్శనం , ఆన్లైన్ లో విడుదల చేసే వివిధ రకాల సేవలు, వీఐపీ సిఫార్స్ లేఖలతో బ్రేక్ దర్శనాలు, వివిధ రకాల ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు అందించే బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్టులకు విరాళం అందించిన దాతలకు అందించే బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్ట్ ద్వారా వీఐపీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం ఉన్నాయి. ఇవేకాకుండా శ్రీవారి మహా లఘు దర్శనం కాకుండా.. స్వామి వారిని అత్యంత దగ్గరగా కులశేఖర పడి ( శ్రీవారి గర్భాలయానికి మొదటి గడప) నుంచి దర్శించుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడీ అవకాశం సామాన్య భక్తులకు కల్పించాలని ఓ పథకం ప్రవేశపెడుతోంది టీటీడీ..
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
శ్రీవారి మొదటి గడప దగ్గర్నుంచి బ్రేక్ దర్శనాలు కల్పిస్తామంటూ కొందరు దళారులు భక్తుల నుంచి భారీగా వసూలు చేస్తుటారు. రూ.500 ఉన్న బ్రేక్ దర్శన టిక్కెట్ల డిమాండ్ బట్టి అధిక మొత్తానికి అమ్మేసి సొమ్ముచేసుకుంటుంటారు. ప్రోటోకాల్ పరిధిలోని బ్రేక్ దర్శనాలు అయితే రూ.10 నుంచి రూ.15 వేలు వసూలు చేసేవారు దళారులు. ఇక సామాన్య బ్రేక్ దర్శనంఅయితే ఒక్కో టికెట్ కు 3 నుంచి 5 వేల రూపాయల చొప్పున తీసుకునేవారు. డిమాండ్ ఎక్కువ ఉన్న రోజుల్లో ఈ లెక్క మరింత ఎక్కువ ఉంటుంది. కొందరైతే బ్రేక్ దర్శనం ఆశచూపి డబ్బులు వసూలు పరారైన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దళారుల నుంచి మోసపోకుండా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ట్రస్టుకు 10వేల రూపాయలు డొనేషన్ ఇచ్చిన దాతకు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. దీనికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో దళారుల ఆగడాలకు దాదాపు 70శాతం చెక్ పెట్టినట్టైంది. కానీ మిగిలిన 30 శాతం మంచి భక్తుల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
దళారులు బ్రేక్ దర్శన టిక్కెట్లతో పాటూ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను కూడా బ్లాక్ లోవిక్రయిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ఒక్కో టికెట్ వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు దళారులకు అదనంగా చెల్లిస్తున్నారు భక్తులు. దీంతో దళారుల ఆగడాలకు అడ్డకట్ట వేయడంతో పాటూ సామాన్య, మధ్యతరగతి భక్తులు కూడా శ్రీవారి బ్రేక్ దర్శనం చేసుకునేలా టీటీడీ ఉన్నతాధికారుల టేబుల్ పై ప్రొపోజల్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు మినీ శ్రీవాణిని ప్రవేశ పెడితే బావుంటుందని కొందరి అభిప్రాయం. అంటే దళారులకు ఇచ్చే సొమ్మును శ్రీవారికి అందేలా చేస్తే పాడైన కొన్ని ఆలయాల నిర్వహణకు వినియోగించవద్దన్నది టీటీడీ యోచన. మినీ శ్రీవాణి ట్రస్ట్ కి అందించాల్సిన విరాళం ధర
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
మినీ శ్రీవాణిని ప్రవేశ పెడితే బాగుంటుందని కొందరి అభిప్రాయం. దళారులకు అప్పజెప్పే సొమ్మును శ్రీవారికి అందించడం ద్వారా పాడైలోయినా ఆలయాల నిర్వహణ., పునరుద్దరణకు వినియోగించవచ్చని టీటీడీ యోచిస్తోంది. మినీ శ్రీవాణి ట్రస్ట్ అందించాల్సిన విరాళం ధర రూ. 3500 నుంచి రూ.5 వేల వరకు ఉండే అవకాశం ఉంది. గతేడాది పెట్టిన ఆ ఫైల్ సమావేశాల్లో ప్రస్తావనకు రావడం, మరుగున పడిపోవడం జరిగింది. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది ఎలాగైనా మినీ శ్రీవాణి ట్రస్ట్ ని అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి యోచన. ఈ నిర్ణయాన్ని భక్తులు కూడా సంతోషంగా స్వీకరిస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక సంస్థను ధనార్జన సంస్థగా మార్చేస్తున్నారన్న విమర్శలు ఎదురైతే మాత్రం మినీ శ్రీవాణి ట్రస్టును అమలు చేసేందుకు టీటీడీ వెనకడుగు వేసే అవకాశం లేకపేలోదు. ఏదేమైనా మినీ శ్రీవాణి టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తే ప్రతి భక్తులు జీవితకాలంలో ఒక్కసారైనా స్వామివారిని అతి దగ్గరగా కన్నులారా దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.
Also Read: మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి