IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Makar Sankranti 2022: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి

హిందువులకు మకర సంక్రాంతి చాలా ప్రత్యేకం. దేశవ్యాప్తంగా సందడి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అంతకు మించి అనిపిస్తుంది. సూర్యుడు దిశను మార్చుకునే ఈ పవిత్రమైన రోజున కొత్తగా ఉండాలంటే కొత్తగా ఆలోచించాల్సిందే

FOLLOW US: 

సంక్రాంతి అంటేనే భోగి మంటలు, రంగు ముగ్గులు, గొబ్బిళ్లు, పిండివంటలు, కోడి పందాలు, పతంగులు, కొత్త అల్లుళ్లు, ఇల్లంతా బంధువులు... ఒకటా రెండా..సంక్రాంతి గురించి చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంది. అయితే అంతా కలసి ఆనందంగా గడిపే క్షణాలను మరింత ఆనందంగా మార్చుకునేందుకు చిన్న చిన్న పనులు చేయమంటున్నారు పండితులు. 

నదీస్నానం
మకర సంక్రాంతి రోజున గలగలపారే నీటిలో స్నానం చేయడం చాలామంచిదంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ, తమకు సమీపంలో ఉన్న నదిలో కానీ స్నానం చేస్తారు. అవకాశం లేనివారు గతంలో నదీస్నానానికి వెళ్లినప్పుడు బాటిల్స్ లో తీసుకొచ్చిన నీటిని ట్యాంక్ లో మిక్స్ చేసి చేసినా కొంత ఫలితం ఉంటుందని చెబుతారు. 

Also Read:  ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
సూర్యుడికి నమస్కారం చేయండి
ఉరకల పరుగల జీవితంలో ఎప్పుడు నిద్రపోతున్నామో, ఎప్పుడు లేస్తున్నామో ( అందరూ కాదు) పట్టించుకోవడం లేదు.  కనీసం సంక్రాంతి రోజైనా సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం( దోసిలితో నీరు) అర్పించండి.  మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకూ జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం. ఈ రోజు సాయంత్రం ( సంధ్యా సమయంలో) ఏమీ తినొద్దు. 

దానం చేయండి..
మకర సంక్రాంతి రోజున దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పేదలకు వస్త్రదానం చేయండి, ఇంటింటా సందడి చేసే డూడూ బసవన్నకి ఆహారం అందించండి. పల్లెటూర్లలో ఉండేవారు మీకు సమీపంలో ఉన్న పశువుల పాకకు వెళ్లి వాటికి ఆహారం అందించి నమస్కరించి రండి.ముఖ్యంగా ఈ రోజు నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిదంటారు. 

Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
పిండి వంటలు పంచుకోండి
సంక్రాంతికి దాదాపు పది రోజుల ముందు నుంచీ పిండివంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. ఏ ఇంట చూసినా  పిండి వంటలు తయారీనే. కొందరు పండుగ రోజు నువ్వులు తినడం ఏంటనే సెంటిమెంట్ తో ఉంటారు కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను సంక్రాంతికి ఆస్వాదిస్తారు. లడ్డు, ఖిచ్డి తయారు చేసి పంపిణీ చేస్తారు. ఇన్ని చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం అని చెప్పుకోవడం కాదు..సరదాగా చుట్టుపక్కల వారితో మీరు చేసినం వంటకాలు పంచుకోండి

అన్నమో రామచంద్రా అనేవారి ఆకలి తీర్చండి
తెల్లవారు జామున నిద్రలేచిన మొదలు నిద్రపోయే వరకూ టైమ్ చూసుకునే టైమ్ లేకుండా పండుగ రోజు గడిపేస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆభుక్తాయాసం తీర్చుకునేందుకు మీరున్న ప్రాంతాన్ని ఓసారి చుట్టేసి రండి. ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి. దేవుడు ఎక్కడో ఉండడు..మనం చేసే సాయం లోనూ, ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనే ఉంటాడంటారు కదా..అందుకే పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు.. పస్తులున్న వారి కడుపునింపండి...

ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆశిస్తోంది మీ ఏబీపీ దేశం....

Also Read:  మీ ఆలోచనా విధానాన్ని బట్టి మీరెలాంటి భోజనం చేశారో చెప్పొచ్చు...
Also Read: సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 07:28 AM (IST) Tags: Sankranthi 2022 Sankranti 2022 makar sankranti 2022 makar sankranti makar sankranti 2022 date makar sankranti kab hai makar sankranti mahiti 2022 makar sankranti 2022 kab hai makar sankranti 2022 date time sankranti 2022 videos 2022 sankranthi makar sankranti 2022 tarikh मकर संक्रांति 2022 makar sankranti 2022 me kab hai makar sankranti vahan 2022 sankranthi date 2022 2022 sankranthi date makar sankranti 2022 mein kab hai

సంబంధిత కథనాలు

Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం

Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం

Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్‌ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!

MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్‌ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Rishabh Pant: ఎంత పనిచేశావ్‌ పంత్‌! టిమ్‌డేవిడ్‌పై రివ్యూ ఎందుకు అడగలేదంటే?

Rishabh Pant: ఎంత పనిచేశావ్‌ పంత్‌! టిమ్‌డేవిడ్‌పై రివ్యూ ఎందుకు అడగలేదంటే?