Mahakumbh 2025: అఘోరాల దేవుడెవరు - చనిపోయిన తర్వాత వారి శరీరాలను ఏం చేస్తారు - ఆ పదానికి అసలు అర్థమేంటీ..!
Mahakumbh 2025: మహా కుంభమేళా 2025 అఘోరాలతో కూడిన పురాతన భారతీయ ఆధ్యాత్మికతను, వారి ఆధ్యాత్మిక అభ్యాసాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Mahakumbh 2025: ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభమేళా 2025 ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, సాధకులు తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా పిలుచుకునే ఈ పవిత్ర కార్యక్రమం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. పురాతన సంప్రదాయాలు, సన్యాస ఆచారాలు సజీవంగా కనిపించే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. మహా కుంభమేళాలోని అత్యంత ఎక్కువగా అఘోరీలు, నాగ సాధువులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరు యాత్రికులకు, సోషల్ మీడియాకు ఒక ఆసక్తికరమైన అంశంగా మారారు. ఈ సందర్భంలో పురాతన ఆచారాలను నిర్వహిస్తోన్న సన్యాసులకు సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
అఘోరాలకు అర్థం అదే
ఆంగ్లంలో అఘోరా అంటే కఠినమైనది లేదా భయానకమైనది. కానీ నిజంగా చెప్పాలంటే సరళత, అంగీకారం, శివుని శాశ్వత సత్యాన్ని ఈ అఘోరా అనే పదం సూచిస్తుంది. 7వ శతాబ్దంలో, హర్షవర్ధన్ అనే చక్రవర్తి పాలనలో, ఎముకల దండలు ధరించి బూడిదలో నివసించే నగ్న సన్యాసుల గురించి భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ ప్రస్తావించాడు. అతను వారిని అఘోరాలుగా పేర్కొనకపోయినా, ఈ వర్ణనలు నేటి వారి ఆచారాలను దగ్గరగా పోలి ఉంటాయి.
శివుని మరో అవతారమే అఘోరా
అఘోరాల మూలాలను మొదటగా భారతదేశంలోనే గుర్తించారని చెబుతారు. వీరిని కపాలికలు లేదా పుర్రె మోసేవారుగా పరిగణించబడ్డారు. రొమేనియన్ చరిత్రకారుడు మిర్సియా ఎలియాడ్ తన 1958 పుస్తకం యోగా: ఇమ్మోర్టాలిటీ అండ్ ఫ్రీడమ్‌లో ప్రకారం, అఘోరాలు శైవ సంప్రదాయాలతో లోతుగా అనుసంధానించబడి వేల సంవత్సరాల నాటి ఆచారాలను సంరక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జన్మించిన బాబా కినారామ్ శైవ అఘోరాలకి స్థాపకుడు అని చెబుతారు. శివుని అవతారంగా భావించే ఈ బాబా కినారామ్.. అఘోరా పద్ధతులను, ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకువచ్చిన ఆధ్యాత్మిక నాయకుడిగా పేరొందాడు.
అఘోరాల ఆచారాలు: చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎలా చేస్తారంటే..
అఘోరాల సంప్రదాయం ప్రకారం, అఘోరా, సన్యాసుల మృతదేహాన్ని మరణం తర్వాత దహనం చేయరు. వారి డెడ్ బాడీని తలక్రిందులుగా ఉంచి, అంటే తలను కిందికి, పాదాలను పైకి ఉంచుతారు. అలా వారి శరీరాన్ని సుమారు 40 రోజుల పాటు అలానే ఉంచుతారు. ఆ తర్వాత దానికి పురుగులు పట్టి, సగం గంగా నదిలో కలిసిపోతుంది. కానీ తలను మాత్రం ఆధ్యాత్మిక సాధనల కోసం భద్రపరుస్తారు. ఈ ఆచారం భౌతిక శరీరం నుండి వైదొలగడం, జీవితం, మరణం అనే శాశ్వత చక్రాన్ని అంగీకరించడాన్ని సూచిస్తుంది.
దత్తాత్రేయ ప్రభువు: అఘోరుల దైవిక గురువు
అఘోరాలు దత్తాత్రేయుడిని తమ దేవతగా పూజిస్తారు. దత్తాత్రేయుడిని పవిత్ర త్రిమూర్తులు - బ్రహ్మ, విష్ణు, శివుడి అవతారంగా నమ్ముతారు. తంత్రం, మంత్రాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన జ్ఞానం కోసం సన్యాసంలో మునిగి తేలుతారు. దత్తాత్రేయుడిని సాధారణంగా హిందూ కళ, గ్రంథాలలో ప్రశాంతమైన, జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా, అఘోరాలను వారి తాంత్రిక అభ్యాసాలలో ప్రేరేపించే వ్యక్తిగా భావిస్తూ ఉంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

