News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం వేదకాలం నుంచి వస్తోన్న ఆచారం. ఇందుకోసం పెట్టిన ముహూర్తమే ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక పౌర్ణమి జరుపుకుంటారు..దీని ప్రత్యేకత ఏంటంటే..

FOLLOW US: 
Share:

Eruvaka Pournami 2023: వ్యవసాయాన్ని ఓ యజ్ఞంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేసి దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఈ వేడుకను జ్యేష్ఠ పౌర్ణమిరోజే ఎందుకు జరుపుకుంటారంటే. ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ ‘ఏరువాక’ అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నడానికి సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తంగా ప్రారంభించడాన్ని ‘ఏరువాక’ అని పేరు అంటే వ్యవసాయ పనుల ప్రారంభించడం అని అర్థం. 

జ్యేష్ఠ పౌర్ణమి రోజే ఏరువాక ఎందుకు!

సస్యానికి అధిపతి చంద్రుడు  ఇంకా చెప్పాలంటే నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదటిసారి పొలాన్ని దున్నడం సెంటిమెంట్.

Also Read: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

పంటపొలం దైవక్షేత్రం!

పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తారు, వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం..అందుకే దీన్న యజ్ఞంలా పవిత్రంగా భావించి చేస్తారు. అందుకే పొలం గట్లపై చెప్పులేసుకుని నడుస్తారు కానీ పొలాలు లోపలకు దిగేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోరు. ఏందుకంటే ఆ క్షేత్రం దైవసమానంగా భావిస్తారు. అందుకే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జ్యేష్ఠ పూర్ణిమరోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి పూజిస్తారు. వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగిస్తారు.

Also Read: ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

ఏరువాకకి ఎన్ని పేర్లో!
ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో అంటారు, కన్నడంలో కారణి పబ్సం అని జరుపుకుంటారు. అధర్వణవేదం ఏరువాకను 'అనడుత్సవం'గా చెప్పింది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లడం ఆచరణలో ఉంది. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు లాంటి  మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణుపురాణం ఏరువాకను సీతాయజ్ఞంగా  వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. 
'వప్ప మంగళ దివసం'
'బీజవాపన మంగళ దివసం'
'వాహణ పుణ్ణాహ మంగళమ్‌'
'కర్షణ పుణ్యాహ మంగళమ్‌..' 
అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. 

కొన్ని ప్రాంతాలలో ఊరు బయట, గోగునారతో చేసిన తోరాలు కడతారు. రైతులంతా అక్కడికి చేరి చెర్నాకోలతో ఆ తోరాలను కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకొచ్చి ఎద్దుల మెడలో కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని నమ్ముతారు.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.

Published at : 31 May 2023 03:15 PM (IST) Tags: Significance of Eruvaka Purnima Eruvaka Purnima Eruvaka Pournami 2023 importance of Eruvaka Purnima Eruvaka Punnami 2023

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!

Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!

Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే మీ వంశం వృద్ధి చెందుతుంది!

Mahalaya Pitru Paksha 2023:ఈ 15 రోజులు ఈ 4 జంతువులు, పక్షులకు ఆహారం అందిస్తే  మీ వంశం వృద్ధి చెందుతుంది!

Ancestors In Dream: పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే అది దేనికి సంకేతం!

Ancestors In Dream:  పితృప‌క్షం స‌మ‌యంలో కలలో మీ పూర్వీకులు కనిపిస్తే  అది దేనికి సంకేతం!

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

Dussehra 2023: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

టాప్ స్టోరీస్

Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Lokesh No Arrest :   లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే  - అన్ని  కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Chandramukhi 2: ‘చంద్రముఖి 2’కు ఆ ఓటీటీ నుంచి భారీ ఆఫర్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!