శుక్రసంచారం నెల రోజుల పాటూ ఈ రాశులవారికి లక్ష్మీయోగం



మే 29 వరకూ మిథున రాశిలో సంచరించిన శుక్రుడు మే 30 నుంచి కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి లక్ష్మీయోగం సూచిస్తోంది.



మేష రాశి
కర్కాటక రాశిలో శుక్ర సంచారం ఈ రాశివారికి కలిసొస్తుంది. మీరు ఎంత కష్టమైన పని తలపెట్టినా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. వేతనం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.



మిథున రాశి
శుక్ర సంచారం వల్ల ఏర్పడిన లక్ష్మీయోగం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఇది మీకు సంపద, ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. దాంపత్య జీవితంలో సంతోషం నెలకొంటుంది.



కర్కాటక రాశి
శుక్రుడి సంచారం కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది.



సింహ రాశి
ఈ రాశివారికి కూడా శుక్రుడి సంచారం శుభఫలితాలను ఇస్తోంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. కెరీర్ బావుంటుంది. వృత్తి,వ్యాపారం, ఉద్యోగం బాగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ విధమైన సమస్య తలెత్తినా చిటికెలో పరిష్కరించేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.



వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కలిసొస్తుంది. కోరుకున్నవి నెరవేరుతాయి. ధనలాభం ఉంటుంది. విద్యారంగంలో అనుబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో చదవాలనుకునేవారి కోరికలు నెరవేరతాయి.



మకర రాశి
శుక్ర సంచారంతో ఏర్పడిన లక్ష్మీయోగం వల్ల మకర రాశి వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఈ యోగం మీ హోదాను పెంచుతుంది. ఆర్థికంగా మరో మెట్టు ఎక్కిస్తుంది. ఈ సమయంలో మీరు మీ రంగంలో చేసే పని నుంచి ప్రయోజనం పొందుతారు.



మీన రాశి
కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం మీన రాశివారికి బాగానే ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి.



గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు