ABP Desam


ఈ 5 రాశులవారు ఓటమిని జీర్ణించుకోలేరు


ABP Desam


జీవితంలో వేసే ప్రతిఅడుగు, సాధించిన విజయం, ఎదుర్కొన్న ఓటమి ఇవన్నీ మీ గ‌హస్థితిపై ఆధారపడి ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.


ABP Desam


కొన్ని రాశులవారు ఓటమిని అస్సలు తట్టుకోలేరట. ఇదంతా మీ రాశిప్రభావమే అంటారు జ్యోతిష్యశాస్త్ర పండితులు.


ABP Desam


మేష రాశివారికి పోటీతత్వం ఎక్కువ. వీరు గెలవడాన్ని మాత్రమే ఇష్టపడతారు. గెలిస్తే ఓకే కానీ ఓడిపోయారో అంతే. అస్సలు తట్టుకోలేరు. డిప్రెషన్ కి గురౌతారు. ఓటమిని జీర్ణించుకోలేక తొందరగా కోపం వచ్చేస్తుంది. ఓడిపోవడాన్ని పెద్ద వైఫల్యంలా చూస్తారు.


ABP Desam


సింహరాశివారు కూడా ఓటమిని అస్సలు తట్టుకోలేరు. తాము చాలా గొప్పగా ఊహించుకుంటారు. అన్నీ తామే సరిగ్గా చేస్తామనే గర్వంతో ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారెప్పుడూ తమ కంట్రోల్ ఉండాలనే ఆలోచనతో ఉంటారు. ఓటమి చెందితే అస్సలు భరించలేరట.


ABP Desam


వృశ్చిక రాశివారు అన్ని విషయాల్లోనూ చాలా ఎమోషనల్ గా ఉంటారు. పోటీకి సై అంటే సై ఏంటారు. గెలవడమే లక్ష్యంగా భావిస్తారు. దేనికీ భయపడరు. ఓడిపోవడం అస్సలు నచ్చదు. గెలిస్తే వీరి ఆనందానికి అవధులుండవు కానీ ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోలేరు.


ABP Desam


ధనుస్సు రాశివారికి పోటీ మనస్తత్వం చాలా ఎక్కువ. పందెంకోళ్లలా సై అంటే సై అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడతారు. ఫలితంగా ఓటమి తప్పదు. ఓడిపోతే మాత్రం జీవితం ఇక్కడితో అయిపోయిందా అన్నంతలా ఫీలవుతారట.


ABP Desam


మకరరాశి వారు చాలా కష్టపడి పనిచేస్తారు. తమని తాము గొప్పగా ప్రజెంట్ చేసుకోవాలి అనుకుంటారు. పోటీ పడి ముందుకుసాగుతారు. కష్టపడేందుకు అస్సలు వెనుకాడరు కానీ ఆ కష్టానికి తగిన ఫలితం రాకపోతే మాత్రం హర్టవుతారు,డిస్సప్పాయింట్ అవుతారు.


ABP Desam


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి



Images Credit: Freepik