ఈ రాశులవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతారు



కొందరు సరదా కోసం అబద్ధం చెబుతారు. మరి కొందరు అవసరం కోసం అబద్ధం చెబుతారు. ఇంకొందరు సమస్యను తగ్గించేందుకు అబద్ధమాడతారు. కారణం ఏదైనా అబద్ధాలు మాత్రం చెబుతారు. ఇదికూడా మీ రాశి ఆధారంగానే ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.



మిథున రాశివారికి రెండు నాలుకలుంటాయి. వీళ్లు అలఓకగా అబద్ధం చెప్పేస్తారు. కొన్ని సందర్భాలలో పాజిటివ్ ని కూడా నెగిటివ్ చేయగలుగుతారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మాట మార్చేస్తారు. ఎవరు ఎంత చెప్పినా వీరు చేయాలనుకున్నదే చేస్తారు.



తులారాశివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తటస్థంగా ఉండాలనుకుంటారు. అంటే అటు మాట్లాడరు, ఇటు మాట్లాడరు. నిజం చెప్పరు అలాగని అబద్ధం కూడా చెప్పరు. వీరికి గొడవలు ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకే అటు ఇటూ మాట్లాడకుండా ఉండిపోతారు.



వృశ్చిక రాశివారు రహస్యాలను దాచడంలో వీరిని మించినవారు లేరు. ఎదుటి వారి మనసులో మాటని మాత్రం బయటపెట్టించేందుకు తెగ ప్రయత్నిస్తారు. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, తమని తాము సమర్ధించుకునేందుకు అస్సలు వెనుకాడరు.



ధనస్సు రాశివారు అబద్ధాలను కూడా అందంగా చెప్పేయగల నేర్పు కలిగిఉంటారట. అబద్ధం ఎంతబాగా చెబుతారంటే అది నిజం అని నమ్మేలా. అందరి ముందూ తమని తాము గొప్పగా చూపించుకునేందుకు హాయిగా అబద్దం చెప్పేస్తారట.



మీన రాశివారు చాలా సున్నితంగా కనిపిస్తారు కానీ మహా ముదుర్లు అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వాస్తవప్రపంచాన్ని తట్టుకునే శక్తి ఈ రాశివారికి తక్కువట. అందుకే దాన్నుంచి తప్పించుకునేందుకు అవాస్తవ ప్రపంచంలో అడుగుపెడతారు.



మరి మిగిలిన రాశులవారంతా సత్యహరిశ్చంద్రులా అని అడుగుతారేమో...వందశాతం అవును అని చెప్పలేం కానీ పైన పేర్కొన్న రాశులవారితో పోలిస్తే నిజాయిగా వ్యవహరిస్తారట.



గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.



Images Credit: Freepik