మేష రాశి ఈ వారం మొదటి రెండు రోజుల్లో మేషరాశి వారు ఉన్నత విద్యా రంగాలలో వేగంగా ముందుకు సాగుతారు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు మానసిక ఇబ్బందులు ఉండొచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారం స్థిరాస్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు సాగుతాయి. ఆస్తుల కొనుగోలు సమయంలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. నూతనపెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. విదేశీ పెట్టుబడులు కలిసొస్తాయి.
మిథున రాశి ఈవారం మొదటి రెండు రోజుల్లో మిథున రాశి వారు వ్యాపార జీవితంలో మంచి వృద్ధిని సాధిస్తారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఓ సంస్థతో పరస్పర సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు.
కర్కాటక రాశి ఈ వారం మొదటి రెండు రోజులు కర్కాటక రాశి వారు తమ ఆత్మీయులను కలుస్తారు. మీరు చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలుగుతారు. డబ్బు పెట్టుబడి పెట్టడానికి, విదేశీ పనుల్లో మంచి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
సింహ రాశి ఈ వారం మొదట్లో ఆదాయవనరులు మెరుగుపర్చుకునే పనిలో బిజీగా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేసేందుకు శ్రద్ధ వహించండి. వ్యాపారులు, ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అధ్యయన రంగాలలో పురోగతి సాధిస్తారు.
కన్యా రాశి ఈ వారం కన్యారాశివారికి బాగా కలిసొస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతోషం పెరుగుతుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. టెక్నికల్ రంగాల్లో ఉన్నవారు సక్సెస్ అవుతారు.
తులా రాశి ఈ వారం తులారాశి జాతకులు సాహిత్య, సినీ రంగాలలో ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. రచనా, పరిశోధనా రంగాలలో మీకు అవార్డులు వస్తూనే ఉంటాయి. ఉన్నత విద్య రంగాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది
వృశ్చిక రాశి ఈ వారం వృశ్చిక రాశి వారు తమ జీవనోపాధి రంగాలలో ముందుకు సాగడానికి కష్టపడతారు. పనిని మరింత మెరుగ్గా చేయడానికి సిద్ధంగా ఉండాలి...ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి ఇంటి సభ్యులకు సమయం కేటాయిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారులు,ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంలో ప్రతికూల ప్రభావాల కారణంగా చికిత్స తీసుకోవాల్సి రావొచ్చు.
మకర రాశి ఈ వారంలో నిరుద్యోగులు బిజీబిజీగా ఉంటారు..కానీ..మీ ప్రయత్నాలు మరింత పెంచితేనే మంచి జరుగుతుంది. ఆర్ట్, ఫిల్మ్, టెక్నాలజీ రంగాల్లో వర్ధమాన మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారాంతంలో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి ఈ వారం కుంభ రాశి వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి కష్టపడతారు. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. విద్యార్ధులు మంచి ఫలితాలు సాధిస్తారు.
మీన రాశి ఈ వారం మీనరాశివారు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిరోజు. సంతోషంగా ఉంటారు. ఆర్థికలాభాలుంటాయి.