మే 21 రాశిఫలాలు ఈ రాశులవారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి
మేష రాశి ఈ రోజు మీరు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. క్యాటరింగ్ పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభ రాశి ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. మీలో కళాత్మకను సరైన దారిలో ఉపయోగించుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది.
మిథున రాశి ఈ రాశివారు మాట, ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. మీ మాటతీరు వల్ల ఎవ్వరూ ఇబ్బందిపడకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యంగా గుండెసంబధిత వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటక రాశి ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా పూర్తవుతాయి. అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది.
సింహ రాశి ఈ రోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో విజయం ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. పెద్దల ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతుంది. ప్రభుత్వ పనుల వల్ల లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
కన్యా రాశి ఈ రోజు మీకు చాలా శుభప్రదమైనది. స్నేహితులు, ప్రియమైన వారితో ప్రయాణాన్ని ఆనందిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. విదేశాలలో నివసిస్తున్న స్నేహితుల లేదా ప్రియమైనవారి వార్తలను పొందడం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు లాభపడతారు.
తులా రాశి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రహస్య శత్రువులపై నిఘా ఉంచండి. సోమరితనం వీడండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆకస్మిక ధనం లాభం ఉండొచ్చు. ఆధ్యాత్మిక సాధన ఉంటుంది.
వృశ్చిక రాశి ఈ రోజు మీ మనసు వేరే ఆలోచనల్లో ఉంటుంది. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వాహనసుఖం పెరుగుతుంది. ప్రియమైన వ్యక్తిని కలుస్తారు.
ధనుస్సు రాశి ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం పొందే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది.
మకర రాశి ఈ రోజు అనారోగ్యంగా అనిపిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలసిరాదు. నూతన పెట్టుబడులు పెట్టడం సరికాదు. అధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందరు.ఉద్యోగులకు పని ప్రదేశంలో సహోద్యోగులకు మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
కుంభ రాశి మీరు మొండి వైఖరిని విడనాడాలి. అస్వస్థతగా అనిపిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా ప్రారంభించిన పనులు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన రోజు. ఆర్థిక వ్యవహారాల్లో ఓ అడుగు ముందుకు వేస్తారు.
మీన రాశి ఈ రోజు మీకు మంచి రోజు. ధన,ఆస్తి వృద్ధి ఉంటుంది. ఆలోచనలలో స్థిరత్వం మనస్సులో దృఢత్వం కలిగి ఉండటం ద్వారా మీరు మీ పనిని చాలా చక్కగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి సంతోష సమయం గడుపుతారు. పాత మిత్రులను కలుస్తారు.