మే 20 రాశిఫలాలు, ఈ రాశులవారికి ధనలాభం



ఈ రాశివారు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. కొన్ని కారణాల వల్ల మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు.ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి.



మీరు కుటుంబ సభ్యులతో అవసరమైన చర్చలు జరుపుతారు. ఇంటి మరమ్మతులు చేస్తారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. కార్యాలయంలో అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు.



వ్యాపార రంగంలో ఈ రోజు చాలా బాగా గడిచిపోతుంది. అవసరమైన చర్చల్లో బిజీగా ఉంటారు. పనిభారం పెరగడం వల్ల అనారోగ్య సమస్యలుంటాయి. పరిచయస్తులతో ఆహ్లాదకరమైన సమావేశం ఉంటుంది.



ఈ రోజు అప్పులు తీర్చగలుగుతారు. కొత్త వ్యక్తులతో మంచి సమన్వయం ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రోజు మంచిది. ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. ఏదో మీటింగ్స్ లో బిజీగా ఉంటారు.



కోపం తగ్గించుకుంటే మంచిది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో అవసరమైన చర్చలు జరుపుతారు. వ్యాపారంలో పెద్ద ప్రణాళికలు వేస్తారు.



ఈ రోజు మీరు కొత్తపనులు ఏవీ ప్రారంభించవద్దు. అత్యవసరం అయితేతప్ప ప్రయాణాలు చేయొద్దు. ధార్మిక రంగంపై ఆసక్తి ఉంటుంది. లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బావుంటుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.



ఈ రోజు ప్రారంభం ఆనందంగా ఉంటుంది. కొన్ని సమస్యలు దూరమవుతాయి. పోటీ పరీక్షలకో విద్యార్థులు విజయం సాధిస్తారు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది.



ఈ రాశివారు కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావొచ్చు. స్నేహితులు, బంధువులను కలుస్తారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు. ఉద్యోగులు పనిపై దృష్టిసారించాలి.



ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కష్టపడి పనిచేసినా ఫలితం తక్కువగా ఉండడంతో నిరాశ చెందుతారు. రిస్క్ తీసుకోవద్దు. ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి కానీ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.



ఈరోజు మీరు మీ భావోద్వేగాలను అదుపుచేసుకోవాలి. నిరుత్సాహపరిచే ఆలోచనలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు దాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట తూలొద్దు.



ఈ రోజు మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉంటారు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఇంకొంతకాలం కొనసాగుతాయి. మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక ఆందోళన ఉండవచ్చు. విద్యార్థులు మరింత కష్టపడితేనే ఫలితాలు సాధిస్తారు.



ఈ రోజు ఎవరితోనైనా విబేధాలు, మనస్పర్థలు ఏర్పడవచ్చు. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రణాళికలు ఉన్నప్పటికీ అడుగు ముందుకువేసేందుకు ఆలోచిస్తారు.