వారఫలాలు: మే 29 నుంచి జూన్ 4 వరకూ మీ రాశిఫలితంమేష రాశి
ఈ వారం శుభకరంగా ఉంటుంది. విజయం ప్రాప్తి. ఈ వారం మీరు మీ శ్రమ,అదృష్టంతో పురోగతిని సాధించడంలో పూర్తిగా విజయవంతమవుతారు. ఈ వారం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం కలిసి వస్తుంది. వృత్తి-వ్యాపారంలో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు వస్తాయివృషభ రాశి
వారం ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ ద్వితీయార్ధంలో జాగ్రత్త అవసరం.మీరు తీసుకునే నిర్ణయానికి తోబుట్టువులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త భూములు, వాహనాలు, భవనాల క్రయవిక్రయాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.మిథున రాశి
ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు, మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో మీ వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు పనికి సంబంధించి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.కర్కాటక రాశి
మీ తెలివితేటలును, నైపుణ్యాలను అందరూ ప్రశంసిస్తారు. స్నేహితుల వలన ప్రత్యేక ఆనందం పొందే అవకాశం ఉంటుంది. ఈ వారం బాస్ ఉద్యోగస్తుల పట్ల పూర్తి సానుకూలంగా ఉంటారు. పనిప్రాంతంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు.సింహ రాశి
సింహరాశివారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శిరో సమస్యలు తలెత్తుతాయి.. దీనివలన మానసిక ఆందోళన, చికాకులు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అనుకున్న విజయాలు సాధించలేరు. లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.కన్యా రాశి
ఈ రాశివారికి ఈ వారం కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో మీ పని సాధారణ వేగంతో సాగుతుంది కానీ వారం మధ్యలో మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. బంధువుల నుంచి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి .తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. వారం ప్రారంభం నుంచి వృత్తి వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. చాలా కాలంగా బదిలీ లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ వారం మీ ఈ కోరిక నెరవేరుతుంది.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో భూమి, భవన క్రయవిక్రయాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో కుటుంబంలో ప్రియమైన వ్యక్తి గొప్ప విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.ధనస్సు రాశి
ఈ వారం ధనస్సు రాశివారు లాభపడతారు. జీవితంలో ముందుకు సాగేందుకు మార్గం కనిపిస్తుంది. సోమరితనం వీడండి. పనులను వాయిదా వేసే ధోరణి మీకు హానికరం. ఈ వారం, మీరు మీ మాటలు మరియు ప్రవర్తనను నియంత్రించడంలో విజయవంతమైతే మీ పని సకాలంలో పూర్తవుతుంది .మకర రాశి
ఈ వారం సాధారణం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు మీ పనిని నిర్వహించడానికి ఎక్కువ హైరానా పడతారు. మీరు విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేస్తుంటే లేదా విదేశాల్లో కెరీర్ వృద్ధి చేసుకోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం.కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి , వ్యాపారం గురించి చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి, లేకపోతే మీరు భారీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి.మీన రాశి
ఈ వారం మీకు శుభం జరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నూతన ఉత్సాహం, శక్తి ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారం ప్రారంభంలో ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు పెరుగుతాయి.


Thanks for Reading. UP NEXT

మే 28 రాశిఫలాలు, ఈ రాశులవారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది

View next story