అన్వేషించండి

YSRCP MLAs Tension :హారతులు ఎక్కువయ్యే గడప గడపకూ వెళ్లలేకపోతున్నారట - ఎవరికీ తెలియని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఆవేదన ఇదే

గడప గడపకూ కార్యక్రమంతో ఖర్చు పెరిగిపోతోందని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. తన ఆవేదననూ సీఎం జగన్‌కూ చెప్పారంటున్నారు.

YSRCP MLAs Tension :  సీత బాధలు సీతవి.. పీత బాధలు పీతవని చెబుతూంటారు. ఇలాంటి కష్టమే వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు కూడా వచ్చింది.  గడప గడపకు తిరగాల్సిందేనని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు గట్టిగా చెబుతున్నారు.  కానీ ఎమ్మెల్యేలు మాత్రం బద్దకిస్తున్నారు. దీనికి కారణం... ప్రజాగ్రహమని.. మరొకటని ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ అసలు విషయం మాత్రం మెల్లగా బయటపెడుతున్నారు. అదేమిటంటే.. హారతులు తట్టుకోలేకే. అంటే హారతులు ఇచ్చేటప్పుడు ముఖానికి వేడి తగలడమో.. మరొకటో కాదు.. హారతిచ్చిన పళ్లెంలో ఖచ్చింగా ఐదు వందలు వేయాలి. ఆమె పార్టీ నాయకురాలైతే.. కొంచెం ఎక్కువే సమర్పించుకోవాలి. ఒకరిద్దరికైతే సర్దుకుంటారు..కానీ అందరూ అదే పని చేస్తూండటంతో ఎమ్మెల్యేల జేబులకు చిల్లు పడుతోంది. 

గడప గడపకూ వెళ్తే కనీసం రోజుకు యాభై వేల ఖర్చు 

ఎన్నికలకు ఇంకా 16నెలలు మందుగానే గడప గడపకు వెళ్ళటం వలన ఖర్చు ఎక్కువైపోతోందని వర్క్ షాప్‌లో జగన్ ఎదుటే పలువురు ఎమ్మెల్యేలు ఓపెన్ అయిపోయారని చెబుతున్నారు.  మరి కొందరు నేతలు. ఎమ్మెల్యే అయితే ఎలాగొలా లాక్కోస్తున్నాం కాని, ఇంచార్జ్ పరిస్దితి అయితే మరి దారుణంగా మారిందని అంటున్నారు. ఇప్పటికే పాలిటిక్స్ కాస్ట్ లీ గా మారాయని,చాలా మంది నేతలు జగన్ వద్ద నేరుగా ప్రస్తావిస్తున్నారట. నియోజకవర్గాల వారీగా జగన్ నిర్వహిస్తున్న సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇంచార్జ్ తో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.ఇదే సమయంలో నియోజకవర్గంలో పరిస్దితి, పని తీరుతో పాటుగా ఖర్చులు, కూడా ప్రస్తావనకు వస్తున్నాయని నేతలు అంటున్నారు. నేతలు కూడా తమ కష్టానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వేడుకుంటున్నారని అంటున్నారు. గడప గడపకు వెళ్ళటం కోసం కష్టపడి తిరగటం ఒక ఎత్తయితే, పర్యటనలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు అవసరం అయిన ఖర్చలు పెట్టుకోవటం కూడా సమస్యగా మారిందని అంటున్నారు. కొన్ని చోట్ల నాయకులు ఆర్దికంగా బలంగా ఉంటే వారు కొంత మేర సర్దుబాటు చేసుకుంటున్నారని, విభేదాలు ఉన్న ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఖర్చంతా ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ ల నెత్తిన పడుతుందని చెబుతున్నారు.

ఎమ్మెల్యే అనే సరికి వ్యక్తిగత సమస్యలకు ఆర్థిక సాయం అడుగుతున్న జనం 

కేవలం గడప...గడప కార్యక్రమానికి రోజుకు 50వేలకు పైనే ఖర్చు అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. గడప గడపకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళలు హరతి పడితే పళ్లెంలో కనీసం 500 ఆపైన పెడితేనే వారు సంతోషంతో ఉంటున్నారు. ఇలా ఇవ్వాల్సిన పరిస్థితిని స్వయంగా జగన్‌కు వివరించారు. ఇందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు కూడ ఓ ఎమ్మెల్యే తన ఫోన్ లో జగన్ కు చూపించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు హరతులు పట్టం వలన ఖర్చు పెరుగిపోయిందని అదికార పక్షం నేతల ఆవేదన.ఇక వీటితో పాటుగా ఇంటి ముందుకు వెళ్ళి గడపలో ఉన్న కుటుంబ సభ్యుల బాగోగులు ప్రశ్నించినప్పడు, ఆరోగ్యం బాగోలేదనో, పిల్లలకు పుసతాకాలు లేవనో,చేతి పని చేసుకునేందుకు కుట్టు మిషన్ కావాలనో,ఇస్త్రి బండి, కూరగాయల బండి వంటివి అడిగినప్పుడు వాటిని వెంటనే  అందించాల్సి వస్తుందని .. ఇలా కూడ ఖర్చు పెరిగిపోతుందని నేతలు చెబుతున్నారు.ఇలా ప్రతి దానికి ఎంతో కొంత సమర్పించుకోవల్సి రావటం వలన గడప..గడప కాస్ట్ లీ గా ఉందని నేతలు తమ ఆవేదననే వెలిబుచ్చుతున్నారు.

ఇంతా చేసిన సర్వే పేరుతో టిక్కెట్ ఇవ్వకపోతే ఏం చేయాలనేది ఎమ్మెల్యేల బాధ ! 

తామంతా కష్టపడి గడప...గడప తిరుగుతున్నాం... 16నెలలు ముందుగానే ఖర్చు కూడ పెట్టేస్తున్నాం..ఆఖరి నిమిషంలో తమకు సర్వే ఫలితాలు లేవని చేతులు ఎత్తేస్తే ఎం చేయాలని కొందరు నేతలు బహిరంగంగానే తమ వేదనను బయటపెడుతున్నారు.సర్వేలో ఫలితాల ఆదారంగా టిక్కెట్ కేటాయింపులు చేస్తున్న నేపద్యంలో కులా సమీకరణాల్లో వేరొక నియోజక వర్గానికి వెళ్ళాల్సి వస్తే, మరలా అక్కడ మెదటి నుండి పని చేసుకోవటం, ఖర్చులు పెట్టుకోవటం వలన తామంతా ఆర్దికంగా సతమతం అవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరి వీరి ఆవేదనను జగన్ ఆలకిస్తారో లేదో ! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget