By: ABP Desam | Updated at : 15 Dec 2022 01:12 PM (IST)
మడకశిర వైసీపీలో రచ్చ
YSRcP News : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తార స్థాయికి చేరింది. రెండు వర్గాల మధ్య ఉన్న వర్గపోరు భగ్గుమంది. నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా మరో బలమైన వర్గం ఉంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతి పరుడని పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. వర్గాలను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుట ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతారన్న ఉద్దేశంలో పోలీసుల్ని సైతం రంగంలోకి దించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
తిప్పేస్వామి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన మరో వర్గం
ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను మడకశిరలో ఏర్పాటు చేసింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. తిప్పేస్వామి వ్యతిరేకవర్గం ఈ పనికి పాల్పడిందని అంటున్నారు. కా ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే వర్గీయులు, వ్యతిరేక వర్గీయులు విడిపోయి మంత్రికి స్వాగతం పలికారు. రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మంత్రికి వేర్వేరు ప్రాంతాల్లో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం జగనన్న ముద్దు ఈ అవినీతి చక్రవర్తి మాకొద్దు నినాదాలు చేశారు.
పెద్దిరెడ్డి సమీక్షలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడకుండా పోలీసులతో వార్నింగ్
నిజానికి వీళ్లందర్నీ కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న నాయకులను స్థానిక సీఐ పోలీసు స్టేషన్‌కు పిలిపించి, మంత్రి ముందు నోరు విప్పవద్దని హెచ్చరించారు. వై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి కారణంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామని భావిస్తున్న వైసీపీలోని ఒక వర్గం గట్టిగా గొంతెత్తేందుకు సిద్ధమవుతోంది. అయితే, అనూహ్యంగా ఈ వర్గం నేతలకు పోలీసుల నుంచి హెచ్చరికలు అందాయి. బుధవారం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ‘మంత్రి వద్ద నోరు విప్పొద్దు’ అంటూ సీఐ సురేశ్ వారికి హుకుం జారీచేశారు.ఈ విషయం బయటకు రావడంతో సంచలనం అయింది. అయితే వైసీపీ నేతలు..ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరించే విషయంలో వెనక్కి తగ్గలేదు. మంత్రి ఎదుటే నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే ఏ మేలూ చేయలేదని పార్టీ కార్యకర్తల ఆరోపణ
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సొంత పార్టీవారినే ఎమ్మెల్యే అణచివేస్తున్నారని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ‘జగన్ ముద్దు, తిప్పేస్వామి వద్దు’ అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని అసంతృప్త నేతలు ప్రకటించారు. రూ.10 లక్షలు ఇవ్వనందుకు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓ అధికారిని ఎమ్మెల్యే సస్పెండ్ చేయించారని ఆరోపించారు. వైసీపీలోని 15 మంది నాయకులను ఎమ్మెల్యే టార్గెట్ చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేతల మధ్య పంచాయతీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిష్కరించాల్సి ఉంది.
ముందస్తు వ్యూహాల్లో భాగంగానే వరుస భేటీలు? కన్నా మౌనానికి కారణమేంటి?
TS Budget Tensions : కేంద్రం నుంచి వచ్చేది అరకొరే - బడ్జెట్ కత్తి మీద సామే ! హరీష్ రావు లెక్కల మాయాజాలం ఎలా ఉంటుంది ?
రసవత్తరంగా నెల్లూరు రాజకీయం- కోటం రెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి!
YSRCP One Capital : విశాఖ ఒక్కటే రాజధానా ? వైఎస్ఆర్‌సీపీ రాజకీయ వ్యూహం మారిందా ?
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
Ministers On Tapping : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - కోటంరెడ్డికి మంత్రుల కౌంటర్ !
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు