అన్వేషించండి

YS Sharmila: ఈ ప్రాంతంపై వైఎస్ షర్మిలకు గురి, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీకి సై! YSRTP ఇక్కడ బోణీ కొట్టేనా?

Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన షర్మిల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాలేరును ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

YSRTP NEWS: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కూతురిగా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన వై.ఎస్‌.షర్మిల పాలేరుపై కన్నేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన షర్మిల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాలేరును ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌ అభిమానులు సైతం అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ్నుంచే పోటీ చేసేందుకు సముఖత చూపిస్తున్నట్లు సమాచారం. గత రెండు నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల పాలేరు తాను పోటీ చేసేందుకు అనుకూలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వైఎస్సార్‌ అభిమానులు ఆయన కూతురిగా తనకు ఆదరణ కల్పిస్తారనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలేరు నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పాలేరు నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీకి ఆదరణ..
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ కలిగినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ అభిమానులు తనకు సహకరిస్తానే భావనతో పాలేరు నుంచి షర్మిల పోటీ చేసేందుకు సముఖుత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పాలేరులో రెడ్డి సామాజిక వర్గం సైతం బలంగా ఉంది. ఇది కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.

రాంరెడ్డి అభిమానులపై గురి..
పాలేరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి ఇక్కడ బలమైన క్యాడర్‌ ఉంది. ఆయన మరణాంతరం రాంరెడ్డి కుటుంబీకులు రాజకీయాలకు దూరంగానే ఉంటుండటంతో క్యాడర్‌ తలోదిక్కుగా మారిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్‌రెడ్డికి రాంరెడ్డి క్యాడర్‌ పూర్తిస్థాయిలో పని చేయడంతో మాజీ మంత్రి తుమ్మల లాంటి వ్యక్తిపై ఉపేందర్‌ రెడ్డి విజయం సాదించారు. ఈ నేపథ్యంలో రాంరెడ్డి వెంకట రెడ్డికి వైఎస్సార్‌ ఉన్న సంబంధం నేపథ్యంలో ఆయన అనుచరులు కూడా వైఎస్సార్‌పై ప్రత్యేక అభిమానం చాటుకుంటారు. ఈ సమీకరణాలన్ని తనకు కలిసివస్తాయనే బావిస్తున్న షర్మిల వైఎస్సార్‌ టీపీ నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటున్న వైఎస్సార్‌ అభిమానులు షర్మిలకు సహకరిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే.

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prashant Kishor Wins: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? ఇక బీహార్‌లో బీజేపీకి ప్రత్యర్థి పీకేనేనా?
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget