అన్వేషించండి

Vizag MLC Election : విశాఖలో మళ్లీ ఎన్నికల కోడ్ - వైఎస్ఆర్‌సీపీకి ఉనికి సమస్య - తేడా వస్తే ?

Andhra Prdesh : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి సంఖ్యాపరంగా తిరుగులేని ఆధిక్యం ఉంది. కానీ ఉపఎన్నికల్లో గెలుస్తుందా ?

YSRCP :  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు నెలల్లోనే వైసీపీ అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోబోతోంది. అదే విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక. జనసేనలో చేరడంతో ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ మీద అనర్హతా వేటు వేశారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ మేరకు  కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.  ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన జరుగుతుంది.  

స్థానిక సంస్థల్లో వైసీపీకి భారీ ఆధిక్యత

విశాఖ స్థానిక సంస్థల ఓటర్లలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు ఉండగా, అధికార పార్టీ టీడీపీకి కేవలం 215 మాత్రమే ఉన్నాయి. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. సంఖ్యాపరంగా చూస్తే వైసీపీ గెలుపు సునాయాసం. ఇతర పార్టీలు పోటీలో నిబలడేందుకు కూడా ఆసక్తి చూపవు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ గెలుపుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వైసీపీ ఓటర్ల  భారీ వలసలు

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతోదంి.  విశాఖలో పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు కొంతమంది ఎంపీటీసీలు, సర్పంచ్ లు, జడ్పీటీసీలు టీడీపీ గూటికి చేరారు. కానీ మెజార్టీ ఓటర్లు పార్టీలోనే ఉన్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కార్పొరేటర్లను ముందస్తుగా క్యాంపులకు తరలిస్తున్నారు. ఇంకా నెల రోజుల వరకూ ఓటింగ్ కు సమయం ఉన్నా.. ముందు జాగ్రత్తగా ఎంత ఖర్చు అయినా భరించి ఓటర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అభ్యర్థులెవరు ?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి అభ్యర్థి కూడా కీలకమే. ముఖ్యంగా ఓటర్లను సంతృప్తి పరిచేలా అర్థిక సామర్థ్యం ఉన్న నేత అవసరం. వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ పేరు వినిపించింది. అయితే తాను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఆర్థికంగా చితికిపోయి ఉన్నానని ఆయన వెనుకడుగు వేశారని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి కాస్త బలమైన నేపధ్యం ఉన్న  నేతలు ముందుకు రావడం కష్టమే. అయినా వైసీపీ హైకమాండ్ సరైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా ప్రచారంలోకి రాలేదు. జనసేన పార్టీకి కేటాయిస్తారా లేకపోతే సీట్ల కేటాయింపులో అవకాశం దక్కని టీడీపీకి చెందిన సీనియర్ నేతలకు చాన్సిస్తారా అన్నది తేలాల్సి ఉంది. 
 
బీఆర్ఎస్ స్ఫూర్తితో గెలవాలని వైసీపీ ప్రయత్నం

ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మహబూబ్ నగర్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉపఎన్నిక వచ్చింది.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ ఉపఎన్నిక వచ్చింది. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా బీఆర్ఎస్ తన ఓటర్లను కాపాడుకుని .. ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే స్ఫూర్తితో గెలవాలని వైసీపీ అనుకుంటోంది. ముందుగానే ఓటర్లను క్యాంపులకు తరలిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
Embed widget