అన్వేషించండి

YSRCP What Next : పట్టభద్రులిచ్చిన తీర్పుతో షాక్ - వైసీపీ దిద్దుబాటు చర్యలేంటి ? లైట్ తీసుకుంటారా ?

పట్టభద్రుల తీర్పుతో షాక్ వైసీపీ హైకమాండ్ వ్యూహం మార్చుకుంటుందా ?తీర్పును అంగీకరిస్తుందా ?లైట్ తీసుకుంటుందా ?కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ?

YSRCP What Next :  మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓడిపోవడం వైఎస్ఆర్‌సీపీకి నష్టం కాదు.. హెచ్చరికా కాదు అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు ప్రకటించారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా  బహిరంగంగా ఆయన అలా కాకుండా మరోలా స్పందించే అవకాశం లేదు. కానీ అంతర్గతంగా దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు స్పందిస్తున్న తీరు.. వైసీపీ హైకమాండ్ వ్యూహాలపై మాత్రం భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. 

ఐ ప్యాక్‌పై ఆధారపడటం తగ్గించాలని పార్టీ క్యాడర్ విజ్ఞప్తులు ! 

ఎన్నిక ఏదైనా వైఎస్ఆర్‌సీపీలో ఒకే వ్యవస్థ అన్ని బాధ్యతలు చూసుకుంటుంది. ఆ వ్యవస్థకు నేరుగా పార్టీతో సంబంధం ఉండదు. ఆ వ్యవస్థ పేరు ఐ ప్యాక్. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఈ సంస్థను వైసీపీ తరపున పూర్తి స్థాయి పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఫట్టభధ్రుల ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కొంత మంది పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు వైఎస్ఆర్‌సీపీకి పట్టిన దరిద్రం ఐ ప్యాకేనని...క్షేత్ర స్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. ఇక అంతర్గతంగా కూడా ఈ అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఐ ప్యాక్ చేతిలో మొత్తం పెట్టడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఎక్కువ మంది వినిపిస్తున్నారు. అయితే పార్టీ అధినేత సీఎం  జగన్ కు ఐ ప్యాక్ మీద ఎక్కడా లేనంత నమ్మకం ఉంది. ఆ నమ్కకాన్ని కొనాసిగిస్తే.. ఐ ప్యాకే వచ్చే ఎన్నికల్లో లీడ్ చేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలో అయినా జగన్ మనసు మార్చుకుని ఐ ప్యాక్ ను పక్కన పెడితే బాగుండని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. 

పార్టీ క్యాడర్ ను పట్టించుకోవాలని మరికొందరు విజ్ఞప్తులు !

అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు , కార్యకర్తల్లో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. దీనికి కారణం వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అసలు పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోవడమే. ద్వితీయ శ్రేణి నేతలు కూడా చిన్న పని కోసం అయినా వాలంటీర్ల వద్దకు వెళ్లాల్సిందే. ఇది వైసీపీ క్యాడర్‌లో అసంతృరప్తికి కారణం అయింది. ఇక ఓ మాదిరి స్థాయి నేతలు.. తాము పార్టీ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అసంతృప్తికి గురవుతున్నారు. కొంత మంది  పనులు చేసినప్పటికీ బిల్లులు అందడం లేదు. గ్రామాల్లో పంచాయతీల అధికారాలు మొత్తం గ్రామ సచివాలయాలకే ఉండటంతో  వైసీపీ అధినాయకత్వంపై గ్రామ స్థాయి నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉంది. అందుకే క్యాడర్ ను పట్టించుకోవాలన్న సందేశాలు ఎక్కువగా ఆ పార్టీ హైకమాండ్‌కు అందుతున్నాయి. 

తక్షణం అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న సూచనలు !

ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో కనీస మౌలిక సదుపాయాల సమస్య కూడా వెంటాడుతోంది. రోడ్లు, మంచి నీరు వంటి విషయాల్లో గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక ఆర్ అండ్ బీ రోడ్ల సంగతి చెప్పాల్సిన పని లేదు.  ఎన్నికల ఏడాదిలో ప్రజలకు సంబంధించి ఇలాంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కువ సూచనలు వస్తున్నాయి. సంక్షేమం విషయంలోనూ మొదటి ఏడాది.. ఆ తర్వాత ఏడాది పథకాలు అందుకున్న లక్షల మందిని ఇప్పుడు అనర్హుల్ని చేశారని ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించుకుంటే... పరిస్థితి మెరుగవుతుందని అంటున్నారు. 

కారణం ఏదైనా  అతి భారీ మెజార్టీతో గెలిచిన ప్రభుత్వానికి చాలా స్వల్ప కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రజల్లో బలపడుతోంది. దీన్ని తగ్గించుకోవాలంటే.. వైసీపీ పెద్దలు వ్యూహం మార్చుకోవాల్సిందేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మరి ఆ పార్టీ  హైకమాండ్ ఏం చేస్తుందో మరి ! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget