News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Janasena Plans : బలమైన నియోజకవర్గాలపైనే పవన్ గురి పెట్టారా ? - మొదట గోదావరి జిల్లాల్లో యాత్ర ఆ వ్యూహమేనా ?

జనసేనకు బలం ఉన్న చోట్లనే పవన్ యాత్ర ఉంటుందా ?

యాత్రకు మొదట గోదావరి జిల్లాలనే ఎందుకు ఎంచుకున్నారు?

తిరుపతి నుంచి ప్రారంభించే సెంటిమెంట్ ఎందుకు వద్దనుకున్నారు ?

FOLLOW US: 
Share:

Janasena Plans :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు వారాహిని రోడ్డు మీదకు తెస్తున్నారు. పధ్నాలుగో తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. మొదట తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర సాగుతుంది.  తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని గతంలో జనసేన ప్రకటన చేసింది. ఇప్పుడు రూటు మారింది. అన్నవరం నుంచి ప్రారంభానికి నిర్ణయించారు. పొత్తులు ఖాయమని ఇప్పటికే పవన్  స్పష్టం చేసినందున పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవాలని అనుకుంటున్నారు. బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేస్తామని.. పవన్ చెబుతున్నారు. బలం ఉందని భావిస్తున్న గోదావరి జిల్లాల్లోనే మొదట పవన్ రంగంలోకి దిగుతున్నట్లుగా బావిస్తున్నారు.  

గోదావరి జిల్లాల్లో జనసేనకు గణనీయమైన ఓటింగ్ 

పవన్ కల్యాణ్  గోదావరి జిల్లాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అక్కడి సామాజిక సమీకరణాలు తనకు కలిసి వస్తాయనే అంచనాలతో ఉన్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తుతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. టీడీపీతో పొత్తు వేళ ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కానున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఎక్కవ సీట్లు సాధిస్తే అధికారం కు దగ్గర అవుతామనే అంచనాలు ఉన్నాయి. అందులో భాగంగా అన్నవరం నుంచి వారాహితో పవన్ ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరిలోనూ యాత్ర కొనసాగుతుందని చెప్పినా..పూర్తి స్థాయిలో షెడ్యూల్ ఖరారు కాలేదు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు పవన్ వారాహి యాత్ర ప్రారంభం పైన నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

గోదావరి జిల్లాల్లోనే ఓ స్థానం నుంచి పోటీ చేసే చాన్స్ 

బీజేపీ కలిసొచ్చినా, లేకున్నా టీడీపీ..జనసేన పొత్తు ఖాయమని చెబుతున్నారు. టీడీపీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి యాత్రకు నిర్ణయించటంతో ఈ సారి తూర్పు గోదావరిలోని పిఠాపురం లేదా కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ చేస్తారనే వాదన బలపడుతోంది. తన యాత్రలో భాగంగా నియోజకవర్గంలో పవన్ ఫీల్డ్ విజిట్ ఉంటుందని ప్రకటించారు. ప్రతీ రోజు ఉదయం నియోజకవర్గం లో ప్రజల నుంచి వినతులు స్వీకరించేలా నిర్ణయించారు. వీటి ద్వారా స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పైన హామీ ఇచ్చేలా పవన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. 

రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువ నేత నారా లోకేష్ రాయలసీమలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. సీమలోని మూడు జిల్లాల్లో లోకేష్ యాత్ర పూర్తయింది. ఈ కారణంగానే తిరుపతి నుంచి వారాహి యాత్ర ప్రారంభించాలని భావించినా.. ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో యాత్ర ఎన్ని రోజులు ఉంటుందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. ఎక్కువ సమయం ప్రజలతో గడుపుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. రోజుకో నియోజకవర్గం చొప్పున పర్యటన చేసినా దాదాపు 40 రోజులు గోదావరి జిల్లాలకు కేటాయించాల్సి ఉంటుంది. ఎన్నికలయ్యే వరకూ ప్రజల్లోనే ఉంటారా లేకపోతే.. 
గ్యాప్ వస్తుందా అన్నది ముందస్తు ఎన్నికల వేడిని బట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Published at : 04 Jun 2023 08:00 AM (IST) Tags: AP Politics Pawan Kalyan Janasena Pawan Yatra Varahi Yatra

ఇవి కూడా చూడండి

Jaishankar In UNGA: ‘భారత్‌ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్‌

Jaishankar In UNGA: ‘భారత్‌ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్‌

BRS BC Leaders : బీసీ సమీకరణాలపై బీఆర్ఎస్‌లో టెన్షన్ - అదే అస్త్రం గురి పెట్టిన కాంగ్రెస్ ! రాజకీయం ఎజెండా మారుతోందా ?

BRS BC Leaders :  బీసీ సమీకరణాలపై బీఆర్ఎస్‌లో టెన్షన్ - అదే అస్త్రం గురి పెట్టిన కాంగ్రెస్ ! రాజకీయం ఎజెండా మారుతోందా ?

South India : డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమేనా ? ప్రాధాన్యత తగ్గితే రాజకీయం ఎలా మారుతుంది ?

South India : డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమేనా ?  ప్రాధాన్యత తగ్గితే రాజకీయం ఎలా మారుతుంది ?

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

BJP vs Congress in Telangana: ఫుల్ జోష్ లో తెలంగాణ కాంగ్రెస్, సప్పుడు లేని బీజేపీ! బండి దిగాక జోరు తగ్గిందా!

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి