అన్వేషించండి

Telangana Assembly KCR: గౌరవమర్యాదలకు హామీ - సూచనలు, సలహాలు ఇవ్వాలని పిలుపు - రేవంత్ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నిస్తారా?

KCR: కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ మరోసారి చాలెంజ్ చేశారు.ఆయన వచ్చే అవకాశం లేదని నమ్ముతన్నారు. మరి రేవత్ అంచనాలను కేసీఆర్ తలకిందులు చేస్తారా?

KCR Assembly Suspence:  తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ  రాజకీయ చదరంగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో తరచుగా ఒక విషయం స్పష్టం చేస్తున్నారు.. అదే కేసీఆర్ పట్ల గౌరవం. ఒక సీనియర్ నాయకుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ సలహాలు రాష్ట్రానికి అవసరమని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.  సభకు రండి.. మీ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. మీకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగనివ్వం అంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగానే హామీ ఇస్తున్నారు. కానీ కేసీఆర్ వస్తారా రారా అన్నదానిపై స్పష్టత లేదు. 

అది రేవంత్ రాజకీయ వ్యూహమా? 

 ఒక రకంగా రేవంత్ రెడ్డి వేస్తున్న  రాజకీయ బాణం అని బీఆర్ఎస్ నమ్ముతోంది.  కేసీఆర్ సభకు వస్తే ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, రాకపోతే  బాధ్యత గల విపక్ష నేతగా ఆయన విఫలమయ్యారు  అని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు అనేది రేవంత్ వ్యూహం. కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని  భావిస్తున్నారు. పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారాన్ని చెలాయించిన కేసీఆర్, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో సామాన్య ఎమ్మెల్యే సీటులో కూర్చోవడానికి మానసిక ఇబ్బంది పడుతున్నారా అన్న సందేహం కలుగుతోంది. తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేసే విమర్శలను భరించడం ఆయనకు ఇష్టం లేదన్నది ఒక వాదన. అందుకే, ఆయన తన స్థానంలో హరీష్ రావు ,  కేటీఆర్‌ను ముందు పెట్టి సభలో పోరాటం చేయిస్తున్నారు.

 తగ్గిన సంఖ్యాబలం - నైతిక ఇబ్బందులు 

కేసీఆర్ సభకు రాకపోవడానికి మరో ప్రధాన కారణం.. బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేల వలసలు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ వైపు వెళ్తుంటే, సభలో కూర్చుని వారిని చూడటం కేసీఆర్‌కు కచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. పైగా, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వేస్తున్న శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై సభలో నేరుగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ అని ఆయన భావిస్తుండవచ్చు. రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం ముందు తన పాత ప్రసంగాలు పారకపోతే అది పార్టీ కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న భయం కూడా ఉండవచ్చుని అంటున్నారు.  కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఒక ప్రతికూల సంకేతం వెళ్తోంది. ప్రజలు విపక్ష నేతగా బాధ్యత ఇచ్చినా, ఆయన సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు  అనే విమర్శను కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానిస్తున్నా కేసీఆర్ మౌనం వహించడం, ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం లేని వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. 

 రాజకీయ వ్యూహం మారుతుందా? 

ప్రస్తుతానికి కేసీఆర్ ఫామ్ హౌస్  కే పరిమితమవుతున్నారు. కానీ నందినగర్ లో కార్యకర్తల్ని కలుస్తున్నారు.  ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత మొదలైతే, అప్పుడు తురుపుముక్కలా సభలోకి ప్రవేశించి రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని కేసీఆర్ వేచి చూస్తున్నారా అనే సందేహం కూడా ఉంది. అయితే, అప్పటివరకు రేవంత్ రెడ్డి తన  గౌరవ మర్యాదల  మంత్రాన్ని జపిస్తూ కేసీఆర్‌ను ఇరకాటంలో పెడుతూనే ఉంటారు.  మొత్తానికి రేవంత్ రెడ్డి ఆహ్వానం ఒక రాజకీయ ఎత్తుగడ అయితే, దానికి కౌంటర్ ఇవ్వలేకపోవడం బీఆర్ఎస్ వైఫల్యం. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
Telangana Congress Vote Chori Meeting: తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?
తెలంగాణలో కాంగ్రెస్ ఓటు చోరీ సభ - సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసమా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget