అన్వేషించండి

Who is Telangana PCC chief : తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠంపై అదే పీఠముడి - రేవంత్ మాట నెగ్గుతుందా ?

Telangana PCC : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి భారీ పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డి చెప్పిన వారికి ఇస్తారా లేకపోతే ఆయన కాళ్లకు అడ్డం పడే వారికి ఇస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

Who will get the post of Telangana PCC chief  :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏ పంచాయతీ తేలడం లేదు. ఏ ఒక్క పదవి ఎవరికి ఇవ్వాలన్నా ఎన్నోపంచాయతీలు తెర ముందుకు వస్తున్నాయి. ఈ కారణంగా ఎవరికీ ఎలాంటి పదవులు ఇవ్వలేకపోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా పదవి కాలం పూర్తయినా.. ఇంకా ముఖ్యమంత్రి కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే కొనసాగుతున్నారు. ఆయన పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన పేర్లు ఆయన ఇచ్చి వచ్చారు. గత నెలలో ఫైనల్ అయ్యారని అనుకున్నారు. కానీ చివరికి ప్రకటన మాత్రం రాలేదు. ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమన్న అభిప్రాయం వినిపిస్తూండటంతో.. అశావహలు మళ్లీ ఢిల్లీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 

తాను చెప్పిన వారినే నియమిస్తారని రేవంత్ ఆశాభావం  

తెలంగాణ పీసీసీ అధ్యక్ష రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.    తన సూచన, సలహాలకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రకరకాల సామాజిక సమీకరణాలను పరిశీలించి ఆయన పేర్లను సిఫారసు చేశారు. ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ వర్గాన్ని తగ్గర చేసుకునేందుకు ా వర్గం వారికి చీఫ్ పదవి ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నరారు.  మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు అప్పగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కానీ ఆయన కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే. సీఎం, పీసీసీ చీఫ్ పోస్టులు ఒకే జిల్లాకు ఇవ్వడం కష్టం.  

నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు - ఏసీబీ దాడుల్లో బయటపడిన ఆస్తులు

బీసీ, ఎస్టీల నుంచి  నేతల పేర్లను పరిశీలిస్తున్న హైకమాండ్ 

బీసీ సామాజిక తరగతికి చెందిన నేతలకు పీఠం అప్పగిస్తే ఎలా ఉంటుందని  పార్టీ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతోంది.  ఆ సామాజిక తరగతిలో టీపీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్‌, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీ గౌడ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయనకు మరో పదవి ఎందుకని కొంత మంది ఇప్పటికే  ఫిర్యాదులు చేశారు.   అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మెన్‌గా ఉన్న తనకు ఆ పదవి ఇవ్వాలని మధుయాష్కీ కోరుతున్నారు. లోక్ సభ టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చినా వద్దన్నానని.. పీసీసీ చీఫ్ పదవి కోసమేనని ఆయన అంటున్నారు. కానీ ఆయనపై రేవంత్ అంత సుముఖంగా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు.  గిరిజన నేత, ఎంపీ బలరాం నాయక్‌ పేరును  కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.  ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. పార్టీకి అత్యంత లాయలీస్ట్‌గా పేరుంది. అధిష్టానంతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. 

తెలంగాణకు ట్యాగ్‌లైన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి- అంతా అలానే పిలవాలని సూచన

ఇతర పదవుల ప్రకటన కూడా ఒక్కసారే! 

టీ పీసీసీ చీఫ్ పదవి  ఒక్కేటే కాదని.. వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులకుకూా  ఒకే సారి పేర్లు ప్రకటిస్తారని చెబుతున్నారు. ఎందుకటే అధికార పార్టీగా పార్టీ పదవులకూ సైతం ఫుల్ డిమాండ్ ఉంది. తీవ్రమైన పోటీ ఉన్న  కారణంగా.. కొన్ని పదవులకు కొంత మంది పేర్లు ప్రకటిస్తే ఇతర నేతలు అసంతృప్తి గురవుతారు. అలాంటి పరిస్థితి రాకుండా సీనియర్లు అందరికీ .. ముఖ్యంగా ప్రభుత్వంలో పదవులు సర్దుబాటు చేయలేని వారందరికీ.. పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన  నుంచి  వచ్చిన తర్వాత మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తారని.. అప్పుడు పేర్లు ఫైనల్ చేస్తారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.   ఆగస్టు 20 తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ టీపీసీ చీఫ్ ను నియమిస్తారని నమ్మకంతో ఉన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
Vizag News: బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
Embed widget