Nizamabad News : నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు - ఏసీబీ దాడుల్లో బయటపడిన ఆస్తులు
Telangana : నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంట్లో పెద్ద ఎత్తన నోట్ల కట్టలు దొరికాయి. పెద్ద ఎత్తున ఇతర ఆస్తులు కూడా కనుగొన్నారు.
ACB Rides On Nizamabad Municipal Superintendent : నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ పెద్ద ఎత్తున నగదుతో ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహించింది.. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
అల్మరాల్లో దాచి పెట్టిన నోట్ల కట్టల వెలికితీత
ఇంట్లో రూ. 2.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలు చోట్ల దాచి పెట్టిన నోట్ల కట్టలను బయటకు తీశారు. వాటిని లెక్కించేందుకు ప్రత్యేకంగా నోట్ల లెక్కింప యంత్రాల్ని తీసుకు వచ్చారు. అలాగే రూ. 1.10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ను నరేందర్, అతని భార్య, అతని తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదనంగా 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ రూ. 1.98 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బయట పడిన మొత్తం ఆస్తుల విలవ ఆరు కోట్లు ఉన్నా.. బహిరంగ మార్కెట్లో యాభైకోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. మొత్తం సోదాలు జరిగే సరికి వంద కోట్ల ఆస్తులు బయటపడతాయేమోనని అంచనా వేస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎటాక్ - బీఆర్ఎస్ సైన్యానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోతోందా ?
దాసరి నరేందర్‌పై తీవ్ర ఆవినీతి ఆరోపణలు
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్‌గా ఉన్న దాసరి నరేందర్.. రాజకీయ పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటూ.. ప్రాధాన్య పోస్టుల్లోనే కదలకుంటా ఉంటారని అందినకాడికి దండుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో .. మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానిక గండి కొట్టి ఆయన ఆదాయాన్ని పెంచుకున్నారని ఏసీబీకి అనేక ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో ఏసీబీ ఇటవలి కాలంలో పూర్తి స్థాయిలో యాక్టివ్ మారింది. ఫిర్యాదు రావడంతో వెంటనే విచారణ ప్రారభించారు. అంతే కాదు.. అంతకు ముందు కూడా ఆయన ఏసీబీకి చిక్కారు. ఆ కేసుల విషయంలో సోదాల కోసం ఇంటికి వెళ్లారు. ఇంట్లో సోదాలు చేయడంతో ఆస్తుల గుట్టు బయటపడింది.
తెలంగాణలో మరో దిగ్గజ బయో టెక్నాలజీ పరిశ్రమ పెట్టుబడులు - ఒప్పందాలు చేసుకున్న ఆమ్ జెన్ !
జీతం లక్ష .. ఆస్తులు కోట్లు
మున్సిపల్ సూపరింటెండెంట్ గా.. దాసరి నరేందర్ జీతం రూ లక్షలోపే ఉంటుందని.. కానీ ఆయన ఆస్తులు మాత్రం రెండు తరాలకు సరిపడా సంపాదించుకున్నారని భావిస్తున్నారు. అంత మొత్తం సొమ్ము సంపాదించాలంటే.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం తప్ప మరో మార్గం ద్వారా సాధ్యం కాదని గుర్తించి ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు.