Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Bengaluru News: అనగనగా బెంగళూరులో ఓ అన్యోన్యమైన జంట. తమ బాల్కనీలో గార్డెన్ పెంచుకుంటున్నారు. ఆ గార్డెన్‌లో ఓ రొమాంటిక్ వీడియో తీసుకున్నారు.కానీ అరెస్టయిపోయారు. ఎందుకంటే ?

Bengaluru couple Arrested For Ganja Cultivation After Posting Balcony Garden Video On Facebook: సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి . తేడా వస్తే జైల్లోనే ఉంటారు. దానికి బెంగలూరులోని ఓ జంట ఉదాహరణ. తాము ఉండే ఇంట్లో ఓ గార్డెన్ పెంచుతున్నారు. ఆ గార్డెన్ లో ఫోటో షూట్ చేసుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.కానీ పోలీసులు వచ్చి వారి అరెస్టు చేసి తీసుకుపోయారు.ఎదుకంటే గార్డెన్ లో వారు పూల మొక్కలతో పాటు గంజాయి మొక్కల్ని కూడా పెంచుతున్నారు మరి. ఆ విషయం వారు పెట్టిన వీడియోలోనే వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో గంజాయి పంట పండిస్తున్న అస్సాం జంట
అస్సాంకు చెందిన సాగర్ గౌరంగ్, ఊర్మిలా కుమారి అనే భార్యభర్తలు రెండేళ్ల కిందట బెంగళూరుకు వచ్చారు. సాగర్ గౌరంగ్ ఓ హోటల్ నడుపుతూండగా.. ఊర్మిలాకుమారి మాత్రం ఇంట్లోనే ఉంటారు.ఇటీవల వీరిద్దరూ సోషల్మీడియాలో యాక్టివ్ అయ్యారు. పలురకాల వీడియోలు పెడుతున్నారు. ఇలా పెట్టిన వీడియోలో పూల మొక్కల మధ్య గంజాయి మొక్కలు ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం రాగానే వెంటనే ఇంటిపై దాడి చేశారు. మొత్తం పదిహేను పూల కుండిల్లో రెండింటిలో గంజాయి మొక్కలు గుర్తించారు. మరికొన్నికుండీల్లో పీకేశారు.వాటిని డస్ట్ బిన్‌లో గుర్తించారు.
Also Read: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
గంజాయి మొక్కలతో వీడియో అప్ లోడ్ చేయడంతో తలుపు తట్టిన పోలీసులు
గంజాయి మొక్కలను కొంత కాలంగా పెంచుతున్నట్లుగా గుర్తించారు.పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నార్కోటిక్స్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.అస్సాం నుంచి ఈ గంజాయి మొక్కలను తెచ్చి పెంచుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గంజాయి మొక్కలు వాసన ద్వారా కనిపెట్టవచ్చు.అయితే ఈ జంట ఆ వాసన రాకుండా చుట్టూపూలమొక్కలు పెంచుతున్నారు.అంతా తెలిసే చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
మళ్లీ లైఫ్ అస్సామే
ఈ జంట పోలీసుల్ని..సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేసింది. తాము వీడియోలు పెట్టినా గంజాయి మొక్కల్ని ఎవరూ గుర్తించబోరని అనుకున్నారు. కానీ పరిస్థితి రివర్స్ అయింది. రొమాంటిక్ మూడ్‌లో తీసుకున్న వీడియో కాస్తా ట్రాజెడికి మారిపోయింది. వాళ్ల లైఫ్ మళ్లీ అస్సాం అయిపోయే పరిస్థితి వచ్చింది.అందుకే సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసే ముందు ఒకటికి..రెండు సార్లు చూసుకోవాలేమో !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

